డైలీ సీరియల్‌ మలుపులను మించిపోతున్న  నిర్భయ కేసులోని నలుగురు దోషుల ఉరిశిక్ష అమలు ఘ‌ట్టంలో కీల‌క ప‌రిణామం. ఏడేళ్ల‌ నిరీక్షణకు తెరపడేలా ఢిల్లీలోని ట్రయల్‌ కోర్టు డెత్‌ వారంట్లు జారీచేయడంతో  ఈ నెల 22న ఉరితీయడం ఖాయమని అందరూ భావించగా...దోషుల్లో ఒకడైన ముఖేశ్‌ కుమార్‌ సింగ్‌ క్షమాభిక్ష కోరుతూ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు దరఖాస్తు చేసుకోవ‌డంతో  అనూహ్యంగా ఉరి వాయిదా పడింది. అయితే, తాజాగా ఉరి విధించే తేదీ ఖ‌రారైంది. ఫిబ్ర‌వ‌రి 1న ఉరి తీయ‌నున్నారు.

 

త‌న‌కు క్షమాభిక్ష ప్ర‌సాదించాలంటూ నిర్భయ కేసులో దోషి ముఖేష్‌సింగ్ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు దరఖాస్తు చేసుకున్నారు. ముఖేశ్‌ సింగ్‌ క్షమాభిక్ష అర్జీని నిన్న ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజల్‌ హోంశాఖకు పంపిచారు. హోంశాఖ వెంటనే రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు పంపింది. ముఖేష్‌సింగ్ పెట్టుకున్న క్ష‌మాభిక్ష ద‌ర‌ఖాస్తును రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ తిర‌స్క‌రించిన‌ట్లు కేంద్ర హోంశాఖ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. కాగా, ముఖేష్ సింగ్ క్షమాభిక్ష దరఖాస్తును ఒక వేళ రాష్ట్రపతి తిరస్కరించినా దోషులకు కనీసం 14 రోజులు గడువు ఇవ్వాలన్న నిబంధన ఉండటంతో ఈ నెల 22న ఉరి శిక్ష అమలు సాధ్యం  కాదని ఢిల్లీ ప్రభుత్వం, తీహార్‌ జైలు అధికారులు ఇప్పటికే స్పష్టం చేశారు. అయితే, రాష్ట్రప‌తి తిర‌స్క‌రించ‌డంతో ఉరి తేదీని ఖ‌రారు చేశారు. ఫిబ్ర‌వ‌రి 1న నిర్భ‌య దోషుల‌ను ఉరి తీయ‌నున్నారు.

 

కాగా,  నిందితులు కావాలనే తమ ఉరిని వాయిదా వేసేందుకు క్షమాభిక్ష, క్యురేటివ్‌ పిటిషన్ల పేరుతో నాటకాలాడుతున్నారని నిర్భయ తల్లిదండ్రులు, పలువురు అధికారులు, సామాన్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  చి పూర్తి వివరాలతో శుక్రవారం నివేదిక అందజేయాలని ధర్మాసనం తీహార్‌ జైలు అధికారులకు సూచించింది. మరోవైపు నిర్భయ దోషులు నలుగురిని తీహార్‌ జైలు అధికారులు గురువారం నంబర్‌-3 జైలుకు తరలించారు. డెత్‌ వారంట్‌ ప్రకారం వారిని ఈ నెల 22న అక్కడే ఉరి తీయడానికి ఏర్పాట్లు చేసేశారు. తాజాగా దాన్ని ఫిబ్ర‌వ‌రి 1కి మార్చ‌నున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: