ఈనెల 20వ తేదీన జరగాల్సిన క్యాబినెట్ సమావేశం అడ్వాన్సయ్యింది. శనివారం మధ్యాహ్నం 3 గంటలరే మంత్రివర్గ సమావేశం జరగాలని తాజాగా జగన్మోహన్ రెడ్డి డిసైడ్ చేశారు.  మామూలుగా మంత్రివర్గ సమావేశాలు వాయిదా పడటం మామూలే గానీ ముందుకు జరగటం మాత్రం అరుదనే చెప్పాలి. అలాంటిది హఠాత్తుగా మంత్రివర్గం సమావేశం రెండు రోజులు ఎందుకు ముందుకు జరిగిందో అర్ధం కావటం లేదు.

 

 

మొదటి ఈనెల 20వ తేదీన క్యాబినెట్ సమావేశం జరగాలని డిసైడ్ అయ్యింది. దీనికంటే ఒక్కరోజు ముందు అంటే 19వ తేదీన కానీ లేకపోతే 20వ తేదీన ఉదయమే క్యాబినెట్ సమావేశం జరుపుదామని అనుకున్నారు.  ఎందుకంటే 20వ తేదీ నుండి మూడు రోజుల పాటు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు జరగనున్నట్లు ఇప్పటికే ఉత్తర్వులు జారీ అయ్యాయి. జగన్ ఆమధ్య ప్రకటించిన మూడు రాజధానుల ప్రతిపాదనపై సమగ్రంగా చర్చించి నిర్ణయం తీసుకునేందుకు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలను ఏర్పాటు చేస్తోంది ప్రభుత్వం.

 

సరే జగన్ ప్రతిపాదనపై ప్రతిపక్షాలు ప్రత్యేకించి చంద్రబాబునాయుడు ఎంతగా గోల చేస్తున్నారో అందరూ చూస్తున్నదే. రాజధానిలోని 29 గ్రామాల పరిధిలోని ఓ ఐదారు గ్రామాల్లో  గడచిన 32 రోజులుగా రైతులతో చంద్రబాబు ఆందోళనలు చేయిస్తున్నారు. అయితే ఈరోజు జగన్ తో  హైపవర్ కమిటి సమావేశం జరిగింది. దాదాపు గంటపాటు జరిగిన  సమావేశంలో  కమిటి తమ మూడుసార్లు జరిపిన సమావేశ వివరాలపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చింది.

 

అయితే హైపవర్ కమిటి సమావేశం తర్వాత ఏమైందో ఏమో వెంటనే జగన్ శనివారమే క్యాబినెట్ సమావేశం నిర్వహించాలని డిసైడ్ చేయటం సంచలనంగా  మారింది. జగన్ ప్రతిపాదన ఒకవైపు ప్రతిపక్షాల వ్యతిరేకత మరోవైపు  ప్రస్తుతం రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. రోజు రోజుకు ప్రతిపక్షాలు ప్రజలను రెచ్చగొట్టటమే పనిగా పెట్టుకున్నాయి. నిజానికి జనాల్లో వ్యతిరేకత లేకపోయినా లేని వ్యతిరేకతను పెంచేందుకు నానా అవస్తలు పడుతున్నాయి. ఈ నేపధ్యంలోనే క్యాబినెట్ సమావేశాన్ని ముందుకు తీసుకురావటమే సంచలనంగా మారింది.

 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: