జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ స్థాపించిన నాటి నుండి ప్రజా సమస్యలను టార్గెట్ గా చేసుకుని ప్రశ్నించడం కోసం అడుగు పెట్టాను రాజకీయాల్లోకి అధికారం నాకు అవసరం లేదు అంటూ తెగ బహిరంగ వేదికలపై ప్రసంగాలు చేస్తూ కేవలం వైఎస్ జగన్ ని టార్గెట్ గా చేసుకుని ఆ రాజకీయాల్లో అడుగు పెట్టినట్లు గత కొంత కాలం నుండి పవన్ కళ్యాణ్ రాజకీయాలు చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలో ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ జగన్ ని మాత్రమే ప్రశ్నించిన పవన్ చాలా సందర్భాలలో ఎక్కడా కూడా చంద్రబాబుపై ఈగ వాలకుండా కేవలం వైఎస్ జగన్ ను మాత్రమే టార్గెట్ గా చేసుకుని ప్రజలలో ప్రస్తుతం అధికారంలో ఉన్న జగన్ పై వ్యతిరేకత తీసుకురావడానికి నానా తంటాలు పడుతున్న పవన్ కళ్యాణ్ ఇటీవల జాతీయ పార్టీ బీజేపీతో చేతులు కలపడం జరిగింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్.. వై ఎస్ జగన్ ని టార్గెట్ చేసుకుని జైల్లో పెట్టించడానికి పవన్ కళ్యాణ్ బీజేపీతో చేతులు కలిపినట్లు వార్తలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక పక్క వార్తలు వినబడుతుంటే మరోపక్క వైయస్ జగన్ కావాలని వేసిన ప్లాన్ కి పవన్ కళ్యాణ్ బిజెపి ట్రాప్ లో పడ్డారని అడ్డంగా దొరికిపోయారు అని కొంతమంది రాజకీయ విశ్లేషకులు కామెంట్ చేస్తున్నారు.

 

మేటర్ లోకి వెళ్తే 2014 ఎన్నికల సమయంలో బీజేపీతో రాసుకుని పూసుకుని తిరిగినా చంద్రబాబు తర్వాత స్వార్ధ రాజకీయాలు కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ పార్టీపై తీవ్ర వ్యతిరేకత ఉండటంతో బిజెపి పార్టీ ని దారుణంగా విమర్శించి కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపి 2019 ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడిపోయారు. ఇదే తరుణంలో కేంద్రంలో బీజేపీ భారీ మెజార్టీతో అధికారంలోకి రావడం జరిగింది.

 

ఇటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు రాజకీయంగా మనుగడ సాధించాలంటే బీజేపీతో శాంతియుతంగా మెలగాలని బీజేపీతో కలవాలని చూసినా గాని ఏ మాత్రం బిజెపి నుండి చంద్రబాబుకి తలుపులు తెరవకపోవడం తో పైకి కనబడకపోయినా లోలోపల పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసే రాజకీయాలు చేయడంతో పవన్ కళ్యాణ్ కచ్చితంగా బీజేపీలోకి వెళ్తారని అమరావతి రాజధాని విషయంలో జగన్ మొండి పట్టు పట్టడంతో జనసేన పార్టీ బీజేపీ లో విలీనం అవటం వెనకాల జగన్ అమరావతి మొండి పట్టు కారణమని ...బిజెపి లో ఉన్న పవన్ కళ్యాణ్ కచ్చితంగా చంద్రబాబు ఆదేశాలు అమలయ్యేలా రాజకీయాలు చేస్తారు అప్పుడు ఖచ్చితంగా బిజెపి నాయకులకు పవన్ కళ్యాణ్ అడ్డంగా దొరుకుతాడు దీంతో కేంద్ర పెద్దల దృష్టిలో పవన్ కళ్యాణ్ ...చంద్రబాబు పార్ట్నర్ అని అర్థమయ్యేరీతిలో జగన్ పవన్ బిజెపిలో వెళ్లే విధంగా ఏపీ రాజకీయాన్ని మలిచారని రాజకీయ విశ్లేషకులు కామెంట్లు చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: