అమ‌రావ‌తి.. ఆంధ్ర ప్రదేశ్ రాజధాని.. గత నెల రోజులుగా రైతుల నిరసనలు.. చంద్రబాబు నటన.. భార్య త్యాగాలు.. కొడుకు చిలుక పలుకులు.. అన్ని మనం చూస్తూనే ఉన్నాం. ఎక్కడ చూస్తున్నాం ? అంటే టీవీలో చూస్తున్నాం.. పచ్చ మీడియా పేపర్ లో చూస్తున్నాం. అసలు చంద్రబాబు ఆడే నాటకాలు చూస్తుంటే., అబ్బబ్బా నెవెర్ బీఫారు.. ఎవర్ ఆఫ్టర్ అన్నట్టు ఉన్నాయ్ అని అంటున్నారు నెటిజన్లు.        

 

ఇంకా అసలు విషయానికి వస్తే.. చంద్రబాబు డ్రామాలు.. పెయిడ్ ఆర్టిస్టుల నటన.. రాజధాని రైతులను రెచ్చెగొట్టేది చూస్తుంటే.. అమరావతి మన అందరిదీ కదా.. లేదా వీళ్లది ఒక్కటేనా అనే డౌట్ వస్తుంది. ఆలా డౌట్ వచ్చేలా చేస్తున్నాడు చంద్రబాబు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబుపై సోషల్ మీడియా వేదికగా జోకులు పేలుతున్నాయి. చంద్రబాబుపై సెటైర్లు వేస్తున్నారు. 

 

అమరావతిని భ్రమరావతి అంటున్నారు.. చంద్రబాబు గత ఐదేళ్లు అమరావతిలో గ్రాఫిక్స్ చూపించి నిర్మాణాలు పూర్తయినట్టు సోది చెప్పాడు అని కొందరు కామెంట్లు చేస్తే.. మరి కొందరు శృతి మించి చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మరి కొందరు కామెంట్లు చేస్తూ.. ''రాజ‌ధాని విష‌యంలో ప్ర‌తి ఒక్క‌రూ చెప్పేమాట ఇదే! గ‌త ప్ర‌భుత్వం రాజ‌ధాని విష‌యంలో చేసిన ప్ర‌చారానికి పెట్టిన ఖ‌ర్చును ప‌నుల‌కు కేటాయించి ఉంటే.. స‌గానికి పైగా రాజ‌ధాని నిర్మాణం పూర్త‌యి పోయి ఉండేది.'' అంటూ కామెంట్లు చేస్తున్నారు. 

 

ఆ కామెంట్లలో మరికొందరు స్పందిస్తూ.. నిజమే.. ఎంత ప్రచారం చేశారు.. ఎన్ని గ్రాఫిక్స్ చూపించారు..  బాహుబలి సినిమాలో మాహిష్మతి నిర్మాణం అన్నారు.. రాజమౌళిని తీసుకొచ్చి గ్రాఫిక్స్ చూపించారు.. ఇన్ని చేశారు అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. నిజమే కదా.. వాటికీ పెట్టినంత ఖర్చు.. నిజంగా రాజధానిపై పెట్టి ఉంటె రాజధాని సగం నిర్మాణం పూర్తి అయ్యేది కదా అంటున్నారు నెటిజన్లు. 

మరింత సమాచారం తెలుసుకోండి: