బిర్యానీ తినని  వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. ఏదో అక్కడక్కడా కొంతమంది వెజిటేరియన్ లు తప్ప బిర్యానీ అంటే నోరూరే వారే ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. ఎందుకంటే బిర్యానీ టేస్ట్  అలా ఉంటుంది మరి. ఇక మన హైదరాబాదులో బిర్యానీ టేస్ట్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఇదంతా పక్కన పెడితే... ప్రస్తుతం హైదరాబాద్ బిర్యానీ నాణ్యత రోజురోజుకు తక్కువ అవుతుంది అని చెప్పాలి. ఇప్పటికే ఎన్నో బిర్యాని సెంటర్ లు   అధికారుల దాడులతో  మూతపడ్డాయి కూడా. ఇక్కడ తాజాగా హైదరాబాద్ కు  చెందిన ఓ రెస్టారెంట్ నిర్లక్ష్యం కారణంగా తగిన మూల్యం చెల్లించుకోవాల్సి రావడం సంచలనం రేపింది. 

 


 కూకట్ పల్లిలోని  ఓ రెస్టారెంట్లో ఈ ఘటన జరిగింది. కూకట్ పల్లి  ప్రాంతానికి చెందిన ఓ యువకుడు సమీపంలోని రెస్టారెంట్ లో బిర్యానీ ఆర్డర్ చేసాడు. ఇక ఆ తర్వాత కాసేపటికి ఫుడ్ డెలివరీ కాగా అది ఓపెన్ చేసి తింటున్నాడు ఆ యువకుడు. కూకట్ పల్లి కి  చెందిన శ్రీనివాస్ అనే యువకుడు ఫుడ్ డెలివరీ యాప్ ద్వారా బిర్యానీ పెరుగన్నం ఆర్డర్ చేసాడు . ఇక ఆహారం అందుకున్న అనంతరం.. బిర్యానీ ఆతృతగా తినడం మొదలుపెట్టాడు. ఇంతలో పంటి  కింద గట్టిగా తగిలింది. రాయి అనుకోని వేలుతో బయటకు తీయగా అది ఇనుప . దీనిపై చిర్రెత్తిపోయిన  ఆ యువకుడు జొమాటో కస్టమర్ కేర్ కు ఫిర్యాదు చేశాడు. దీంతో వారు ఆ యువకునికి క్షమాపణలు చెప్పి అతనికి ఓ రాయితీ కూపన్  కూడా ఇచ్చారు. 

 


 దీనిపై తాము తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అయితే శ్రీనివాస్ మాత్రం అక్కడితో ఊరుకోకుండా జిహెచ్ఎంసి యాప్ ద్వారా ట్విట్టర్లో బిర్యాని విక్రయించిన  రెస్టారెంట్ పై ఫిర్యాదు చేశారు. యువకుడి ఫిర్యాదుపై స్పందించిన అధికారులు కూకట్ పల్లిలోని  రాజా వారి రుచులు రెస్టారెంట్ లో  తనిఖీలు చేసి.. ఆహార ప్రమాణాలు పాటించనందుకు  5వేలు జరిమానా విధించారు. బిర్యానీలో ఇనుప తీగలు  వచ్చిన విషయాన్ని  వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేస్తా అంటూ ఆ యువకుడు తెలిపాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: