అమరావతిలో రైతులందరూ తీవ్రస్థాయిలో నిరసనలు ధర్నాలు చేపడుతున్న విషయం తెలిసిందే. అమరావతి ప్రాంత రైతులు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి 3 రాజధానిల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రోడ్డెక్కి గత నెల రోజుల నుండి నిరసన తెలుపుతున్నారు.దీంతో  అమరావతి మొత్తం పోతుంది.  జగన్మోహన్ రెడ్డి  3న రాజధానుల  నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు అమరావతి రైతులు. ఇక అమరావతి రైతుల నిరసనలకు ప్రతిపక్ష టిడిపి పార్టీ కూడా మద్దతు తెలుపుతూ... అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. అంతేకాకుండా అమరావతి లో రైతులు చేస్తున్న దీక్షలకు మద్దతు ప్రకటించారు విపక్ష పార్టీల నేతలు. 

 


 ఇకపోతే అటు అధికార పార్టీ కూడా మూడు రాజధానుల విషయంలో ప్రతిపక్షాల విమర్శలను తిప్పి కొడుతున్నారు. గతంలో చంద్రబాబు గ్రాఫిక్స్ చూపించి రాజధాని తాత్కాలికంగా నియమించడం వల్లె  ఇప్పుడు రాజధాని మార్పు చేయాల్సిన అవసరం వచ్చింది అంటూ అధికార పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. గతంలో బూటకపు హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిన చంద్రబాబు ఇప్పుడు మాత్రం ప్రజలపై దొంగ  ప్రేమ చూపిస్తూ మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శిస్తున్నారు అధికార పార్టీ నేతలు. చంద్రబాబు స్వప్రయోజనాల కోసమే అమరావతి లో నిరసన తెలుపుతున్న రైతులకు మద్దతు తెలుపుతున్నారని రైతులందరూ చంద్రబాబు ఉచ్చులో పడవద్దని సూచిస్తున్నారు. ఇక తాజాగా రాజధాని అంశంపై  మంత్రి బొత్స సత్యనారాయణ మీడియా సమావేశం నిర్వహించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

 


 అన్ని వర్గాలకు మేలు జరగాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఆలోచన చేస్తారని మంత్రి బొత్స తెలిపారు. మూడు రాజధానుల నిర్ణయం కూడా ఈ  విధంగా తీసుకున్నదే అంటూ తెలిపారు. గతంలో చంద్రబాబు మాత్రం ఏ కార్యక్రమం చేసినా అతనికి ఎంత వస్తుంది అని చూసారు అంటూ విమర్శించారు. ఏం చేసినా చంద్రబాబు తన స్వార్థం కోసం మాత్రమే చేస్తారని. వ్యక్తిగత స్వార్థంతోనే ప్రస్తుతం అమరావతి లో నిరసన తెలుపుతున్న రైతులకు మద్దతు తెలుపుతున్నారని ఆరోపించారు. అమరావతి రైతులు ఆందోళనను  జగన్ దృష్టికి తీసుకెళ్లామని... వారికి న్యాయం జరిగేలా చూడాలి అంటూ అధికారులను ఆదేశించారు మంత్రి బొత్స. ప్రజల మనోభావాల మేరకే ప్రణాళికతో రాష్ట్ర అభివృద్ధి కోసం జగన్ సర్కార్ ముందుకు సాగుతుందని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: