బిజెపి పార్టీ తో జనసేన పొత్తు పెట్టుకోవడం పట్ల జనసేన పార్టీ సొంత కార్యకర్తలు మరియు పవన్ కళ్యాణ్ అభిమానులు తీవ్ర స్థాయిలో పవన్ కళ్యాణ్ చేస్తున్న రాజకీయం పట్ల తీసుకున్న నిర్ణయం పట్ల బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ని ఎక్కువగా ఆదరించే జనాలలో సామాజిక వర్గాలలో దళితులు మరియు ముస్లింలు ఉంటారు పైగా ఆ పార్టీకి చెందిన ఏకైక ఎమ్మెల్యే దళితుడు అటువంటిది పవన్ కళ్యాణ్ కావాలని తన స్వార్ధ రాజకీయాలకోసం బిజెపితో చేతులు కలపడని తీవ్ర స్థాయిలో తప్పుపడుతున్నారు జనసేన పార్టీ కార్యకర్తలు.

 

మమ్మల్ని మోసం చేసావ్ అనవసరంగా నిన్ను నమ్ముకుని నీ వెనకాల జనసేన పార్టీ జెండా మోసం నడిరోడ్డుపై మా బట్టలు విప్పేసి నట్లు బీజేపీతో కలిసి అందరినీ ఎదవని చేసావ్ అనవసరంగా నీతో రాజకీయ అడుగులు వేసాము అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. ఇటువంటి నేపథ్యంలో వైసీపీ పార్టీ నేతలు ఒక్కొక్కరు ఒక్కో విధంగా పవన్ కళ్యాణ్ బిజెపితో చేతులు కలపడం పట్ల సెటైరికల్ గా కామెంట్లు చేస్తున్నారు. తాజాగా మంత్రి అనిల్ కుమార్ రియాక్ట్ అయ్యారు. ఓడిపోయే ఆరు నెలలు ఆగ లేక పోయాడు పార్టీ నడపలేక పవన్ చేతులెత్తేశారని మంత్రి అనిల్ మండిపడ్డారు.

 

పవన్ ను జనం నమ్మరు. వామపక్ష భావజాలం పేరుతో జనసేన పెట్టిన పవన్.. అందుకు భిన్నంగా వేరే వారితో చేతులు కలిపారని మంత్రి అనిల్ సీరియస్ అయ్యారు. ఉన్న ఒక్క సీటును కూడా నిలుపుకోలేని పవన్ ను జనం నమ్మరు అని చెప్పారు. ఎన్నికలకు ముందే టీడీపీకి పవన్ దత్తపుత్రుడిగా మారారని విమర్శించారు. ఎంతమంది పవన్ కళ్యాణ్ లు గుంపుగా వచ్చినా సీఎం జగన్ ను ఏమీ చెయ్యలేరు..వెంట్రుక కూడా పీకలేరు అని మంత్రి అనిల్ అన్నారు. మరికొంతమంది వైసీపీ పార్టీ నేతలు పవన్ కళ్యాణ్ ని పాచిపోయిన లడ్డూలు తింటా కి వెళ్ళావా బీజేపీలోకి అంటూ ఎద్దేవా చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: