చాలా బాధాక‌రం. చెప్పాలంటే... మ‌న చ‌ట్టాల్లో కొన్ని అమ‌లు అవుతున్న తీరు గురించి ధైర్యంగా చెప్పుకోలేని ప‌రిస్థితి. దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన దారుణ ఘ‌ట‌న అయిన నిర్భ‌య ఉదంతంలో...ఇప్ప‌టికే దోషులు త‌మ ఉరి శిక్ష‌ను వాయిదా వేసుకుంటూ వ‌స్తున్నారు. చట్టంలో ఉన్న కొన్ని లొసుగులను అడ్డుపెట్టుకొని నిందితులు అనూహ్య ఎత్తుగడలు వేస్తున్నారు. దోషుల్లో ఒకడైన ముఖేశ్‌ కుమార్‌ సింగ్‌ క్షమాభిక్ష కోరుతూ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు దరఖాస్తు చేసుకున్నాడు. అయితే, దాన్ని రాష్ట్రప‌తి తిర‌స్క‌రించారు. దీంతో ఫిబ్ర‌వ‌రి 1న వారిని ఉరి తీయ‌నున్నారు. అయితే, దుర‌దృష్ట‌వ‌శాత్తు ఇప్ప‌టికీ...ఇంకా దోషుల‌కు ఉరి వాయిదా వేయించుకునే అవ‌కాశాలు ఉండ‌టం గ‌మ‌నార్హం.

 

నిర్భయ దోషులైన ముఖేశ్‌ (32), వినయ్‌ శర్మ (26), అక్షయ్‌కుమార్‌సింగ్‌(31), పవన్‌ గుప్తా (25) ప్రస్తుతం తీహార్‌ జైలులో ఉన్న సంగతి తెలిసిందే. వారిని ఈ నెల 22న ఉదయం 7 గంటలకు ఉరితీయాలని ఇటీవలే విచారణ కోర్టు డెత్‌ వారంట్లను జారీ చేసింది. అయితే ఉరిని వాయిదా వేసేందుకు వారు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. చట్టంలో ఉన్న కొన్ని నిబంధనలను అడ్డుపెట్టుకొని కొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. న్యాయ‌నిపుణులు పేర్కొంటున్న‌ట్లు..చ‌ట్టంలో నిర్భ‌య దోషుల‌కు ఇంకా క్ష‌మాభిక్ష కోసం ద‌ర‌ఖాస్తు చేసుకునేందుకు ఉన్న‌ అవ‌కాశాలు ఇవి

1. క్యురేటివ్‌ పిటిషన్‌:  ఇప్పటికే దోషులు వినయ్‌శర్మ, ముఖేశ్‌ పిటిషన్లను న్యాయస్థానం కొట్టివేసింది. పవన్‌, అక్షయ్‌ మాత్రం ఇంకా సుప్రీంకోర్టును ఆశ్రయించలేదు.
2. డెత్‌వారంట్‌ను సవాల్‌చేయడం: నలుగురిలో ముఖేశ్‌ మాత్రమే డెత్‌వారంట్‌ను సవాల్‌ చేశాడు. మిగతా ముగ్గురు ఇంకా ఈ అవకాశాన్ని వాడుకోలేదు.
3. 14 రోజుల గడువు: నలుగురు దోషుల డెత్‌వారంట్‌ మరో వారం రోజుల్లో ముగుస్తుంది. నిబంధనల ప్రకారం రాష్ట్రపతి క్షమాభిక్ష పిటిషన్‌ను తిరస్కరించాక 14 రోజులు ఆగి ఉరితీయాల్సి ఉంటుంది. ఈ లెక్కన నలుగురిని ఈ నెల 22న ఉరితీయడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: