అవును వినేవాడు ఉంటే చెప్పేవాడికి లోకువ అనే సామెత ఊరికే పుట్టలేదు. తాను చెబుతోంది అబద్ధమైన అది నిజమే అన్నట్టుగా భ్రమ కల్పించడంలో కొంతమంది సక్సెస్ అవుతుంటారు. అటువంటి వాటిల్లో పిహెచ్ డి చేసినవారు ఎవరైనా ఉన్నారా అంటే అది టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అనే విషయం ఎవరిని అడిగినా అని చెబుతారంటూ ఆయన రాజకీయ ప్రత్యర్థులు విమర్శిస్తూనే ఉంటారు.ఏపీ తెలంగాణ రెండుగా విడిపోయిన తర్వాత పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉండడంతో అక్కడ ఉండే అవకాశం ఉన్నా చంద్రబాబు హడావుడిగా రాజధాని నిర్మాణం అంటూ నిర్ణయం తీసుకున్నాడు. దీనికి సంబంధించి అనేక ప్రాంతాల్లో భూములు కొనుగోలు చేసేందుకు ప్రయత్నించారు. అయితే ఆయన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు ఎక్కువగా ఉండే అమరావతి ప్రాంతంలో ముందుగానే తన కావలసిన కొంతమంది టిడిపి నాయకులకు సమాచారం లీక్ చేసి భారీ ఎత్తున భూములు కొన్నారని ఆరోపణలు చంద్రబాబు మూట కట్టుకున్నారు.


 ఇప్పటికీ ఈ విషయంపై ఆయన స్పష్టంగా ప్రకటన చేయలేకపోతున్నారు. రాజధాని ప్రాంతంలో భారీ ఎత్తున భూములను ముందే సిద్ధం చేసుకుంటే రాజధాని అమరావతి ప్రాంతం బాగా అభివృద్ధి చెందిన తరువాత ఆ భూములకు పదింతల ధరలు పెరుగుతాయని చంద్రబాబు ముందుగానే గ్రహించినట్లు వైసిపి నాయకులు ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. ఇక ఏపీ సీఎం జగన్ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాలనే ఆలోచనతో మూడు రాజధానుల ప్రతిపాదన చేయగానే అందరికంటే ఎక్కువ బాధ చంద్రబాబు పడ్డారు.


 ప్రస్తుతం అమరావతి ప్రాంతంలో కొత్తగా అభివృద్ధి పనులు చేపట్టేందుకు సీఎం జగన్ ఇష్టపడకపోవడం, లక్ష కోట్ల బడ్జెట్ కేటాయించినా అమరావతి ప్రాంతంలో రాజధాని నిర్మాణం చేయడం కష్టసాధ్యమైన పని అని ముందే గ్రహించడంతో విశాఖను రాజధానిగా మార్చేందుకు అన్ని ఏర్పాట్లు చురుగ్గా చేస్తున్నారు. ఇప్పుడు టిడిపి అధినేత చంద్రబాబు లో ఆ భయమే ఎక్కువయ్యింది. అమరావతి ప్రాంతంలో రాజధాని ఉండడం వల్ల అక్కడ భూములకు భారీగా ధరలు పెరుగుతాయని, ఇప్పుడు అక్కడ రాజధాని నిర్మాణం చేపట్టకపోతే భూములకు ధరలు పడిపోతాయని చంద్రబాబు భయం పట్టుకోవడంతోనే ఇలా ఆందోళనలు చేస్తున్నాడని వైసీపీ భావిస్తోంది.


క‌ల‌లు క‌నాలి.. వాటిని సాకారం చేసుకునే వ‌ర‌కు శ్ర‌మించాలి-అబ్దుల్ క‌లాం చెప్పిన మాట‌ను చంద్ర‌బాబు ప‌దే ప‌దే అంద‌రికీ చెబుతుంటారు. కానీ, తాను క‌న్న అమ‌రావ‌తి క‌ల విష‌యంలో మాత్రం అలివిమాలిన క‌ల క‌న్నార‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. ఆయ‌న చెబుతున్న విధంగా రాజ‌ధాని పూర్త‌యి.. ఇక్క‌డ ఎక‌రం భూమి 20 కోట్లు ప‌లికే రోజు వ‌చ్చే స‌రికి మ‌రో వంద సంవ‌త్స‌రాలు ప‌ట్టినా ఆశ్చ‌ర్యంలేద‌ని అంటున్నారు నిపుణులు. సో.. అమ‌రావ‌తి ఓ అలివికాని స్వ‌ప్నంగానే మారిపోనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: