మోసాలకు అలవాటుపడిన రాష్ట్రప్రభుత్వం, ప్రజల్ని మోసగించడానికి తప్పుడు తడకలుగా ఉన్న నివేదికల్ని తమకు అనుకూలంగా మలుచుకుందని, విజయసాయి రెడ్డికి, తన అనుమాయులకు మేలుచేయడంకోసం రాజధానిని విశాఖకు తరలించాలని జగన్‌ చూస్తున్నారని  టీడీపీ సీనియర్‌నేత, ఆపార్టీ పొలిట్‌బ్యూరోసభ్యులు వర్ల రామయ్య మండిపడ్డారు. పోర్చుగల్‌ పోలీసులు రైడ్‌చేయబడి, ఎఫ్‌బీఐ నిఘాజాబితా లో ఉన్న బోస్టన్‌గ్రూప్‌ సంస్థ ఒకబోగస్‌ గ్రూప్‌అని, అలాంటి సంస్థ ఇచ్చిన అబద్ధాల  పుట్టవంటి నివేదిక ఆధారంగా ప్రజల్ని మోసగించాలని చూడటం జగన్‌కే చెల్లిందన్నారు. 

 

బోస్టన్‌గ్రూప్‌ నివేదికలో చెప్పారంటూ, ఐఏఎస్‌ అధికారి విజయకుమార్‌ రాజధాని  ప్రాంతం ముంపుప్రాంతమని చెప్పడం ముమ్మాటికీ అబద్ధమేనని వర్ల స్పష్టంచేశారు. 2009లో వరదలు వచ్చాయని, ఆసమయంలో రాజధాని మొత్తం మునిగిపోయిందని, దానిపై ఐఐటీచెన్నై నుంచి నివేదిక తెప్పించామని, వారుకూడా ఇప్పుడున్నప్రాంతం రాజధానికి అనుకూలంకాదని విజయ్‌కుమార్‌ చెప్పడం జరిగిందన్నారు. నేషనల్‌ గ్రీన్‌ట్రిబ్యునల్‌ తన నివేదికలో కృష్ణానదికి బలమైన గట్లు (కట్టలు) ఉన్నందున  అమరావతి ప్రాంతం ముంపునకు గురయ్యే అవకాశం లేదని, 2009లో వచ్చిన వరదలుకూడా రాజధానిప్రాంతాన్ని తాకలేదని స్పష్టంగా చెప్పడం జరిగిందన్నారు.  

 

గద్ద కోడిపిల్లను తన్నుకుపోయినట్లుగా, జగన్‌ తన తప్పుడు నివేదికలను సాకుగాచూపు తూ, రాజధానిని విశాఖకు తన్నుకుపోవాలని చూస్తోందని వర్ల దుయ్యబట్టారు. ఈనెల 11న హిందూపత్రికలో వచ్చిన కథనానికి స్పందించిన విజయశ్రీచౌదరిఅనే వ్యక్తి, 12వతేదీన చెన్నై ఐఐటీకి ఈ-మెయిల్‌ పంపాడని, దానిలో ఐఐటీచెన్నైవారు బోస్టన్‌గ్రూప్‌కి ఎలాంటినివేదిక ఇచ్చారో చెప్పాలని అతను కోరడం జరిగిందన్నారు. దానికి చెన్నై ఐఐటీకి చెందిన ప్రొఫెసర్‌ రవీంద్రగట్టు సమాధానమిస్తూ, చెన్నై ఐఐటీ తరుపున తాము బోస్టన్‌గ్రూప్‌కి ఏవిధమైన నివేదికలు ఇవ్వలేదని, అమరావతిముంపు గురించి సర్వేచేసే విభాగంగానీ, బృందంగానీ తమవద్దలేరని స్పష్టంచేయడం జరిగింద న్నారు. 

 

 చెన్నై ఐఐటీవారు ఇవ్వని నివేదికను, బోస్టన్‌గ్రూప్‌కి ఇచ్చినట్లుగా ఐఏఎస్‌అధికారి విజయ్‌కుమార్‌, మంత్రి బొత్ససత్యనారాయణ అబద్ధాలు చెప్పడం, లేనినివేదికను ఉన్నట్లుగా చూపుతూ, ప్రజల్ని వంచించడం, వారికి జగన్‌వంత పాడటం ఎవర్ని మోసగించడానికని వర్ల నిలదీశారు. నేషనల్‌ గ్రీన్‌ట్రిబ్యునల్‌ (ఎన్జీటీ) 2017 నవంబర్‌ 17న ఇచ్చిన నివేదిక ప్రకారం పేరా-77లో 'రాజధాని ప్రాంతంలో గట్టున్న కారణంగా కృష్ణానదినుంచి ఎలాంటి వరదరానందున ఈప్రాంతాన్ని వరదముంపుప్రాంతంగా పేర్కొనలేమని, పేరా-79లో 'ఈప్రాంతంలో జరిగే నిర్మాణాలు అక్కడున్న భూజలస్వరూ పంపై ఎలాంటి ప్రభావం చూపవు'  అలానే 2009లో వచ్చిన వరదలవల్ల రాజధాని ప్రాంతంలో ఎలాంటి పరిమితులు దాటలేదని పేరా-80లో స్పష్టంచేసిందన్నారు. చెత్తబుట్టలో ఉండాల్సిన బోస్టన్‌గ్రూప్‌ నివేదికను ఆధారంగా చేసుకొని, వరదలు వస్తాయని, ముంపుప్రాంతమని, నిర్మాణానికి పనికిరాదని చెబుతున్న పాలకులు, ఇప్పటికైనా అసలు నివేదికల్ని పరిశీలించి వాస్తవాలు తెలుసుకోవాలన్నారు. 

 


దున్నపోతు ఈనిందంటే దూడను కట్టేయమన్నట్లుగా ఐఏఎస్‌ అధికారులు వ్యవహరించడం తగదని వర్ల సూచించారు. లేనివి ఉన్నట్లుగా, ఉన్నవి లేనట్లుగా, ఇవ్వని నివేదికలు ఇచ్చినట్లుగా చెబుతున్న పాలకులు, అబద్ధాలతో ప్రజల్ని మోసం చేయాలని చూస్తోందని, మోసకారి ప్రభుత్వాని ప్రజలే శిక్షించాలని రామయ్య మండిపడ్డారు. కేంద్రం నియమించిన శివరామకృష్ణన్‌ కమిటీ, విజయవాడ ప్రాంతం అభివృద్ధికి అనుకూలమని, రాజధానిగా విజయవాడ ప్రాంతాన్ని 4వేలమందిలో 2,191మంది ఆమోదించారని వర్ల పేర్కొన్నా రు. అదేసయమంలో కేవలం 500మంది మాత్రమే విశాఖ రాజధానిగా ఉండాలని చెప్పడం జరిగిందన్నారు. ఇలాంటి వాస్తవాలను తొక్కిపెడుతూ, ప్రజలకు దున్నపోతుని చూపిస్తూ, దాన్ని ఆవు అని నమ్మించాలని జగన్‌ ప్రభుత్వం, ఆయన మంత్రివర్గం చూస్తోందన్నారు. 

 

తనకు 151మంది ఎమ్మెల్యేలు ఉన్నారుకాబట్టి, నాఇష్టం వచ్చినట్లు చేసుకుంటానని, నా అనుచరులకు మేలుచేయడానికే రాజధానిని విశాఖలో పెట్టుకుంటు న్నానని జగన్‌ తనమనసులో ఉన్నది స్పష్టంచేయాలన్నారు. ఎవరికి సాయపడటానికి, ఎవరి సంతోషం కోసం, జగన్మోహన్‌రెడ్డి ఈ దుర్మార్గానికి ఒడిగట్టాడో చెప్పాలని వర్ల డిమాండ్‌చేశారు. అలెగ్జాండర్‌ వంటి ప్రపంచాధినేతే పోయేటప్పుడు ఏమీ తీసుకోలేదనే నగ్నసత్యాన్ని జగన్‌ తెలుసుకోవాలన్నారు. ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన వ్యక్తే,  కోర్టు విచారణకు హజరవ్వకుండా, తనపై ఉన్నకేసుల నుంచి బయటపడకుండా ప్రజలకు ఏం సందేశం ఇస్తాడని వర్ల ప్రశ్నించారు.       

మరింత సమాచారం తెలుసుకోండి: