పాపం జనసేన అధినేత పవన్ కల్యాన్ పరిస్ధితి చూస్తుంటే చాలా జాలేస్తోంది.  ఏడేళ్ళ క్రితం పార్టీ పెట్టి నడపటానికి నానా అవస్తలు పడుతున్న పవన్ తాజాగా బిజెపితో పొత్తు పెట్టుకుని భారాన్ని దింపేసుకున్న విషయం తెలిసిందే. సరే కొద్ది రోజుల తర్వాత జనసేనను బిజెపిలో విలీనం చేసేయటమే మిగిలిందనే ప్రచారం కూడా జరుగుతోందనుకోండి అది వేరే సంగతి. అయితే కమలం పార్టీతో పొత్తు పెట్టుకున్న ప్రశాంతతను తొందరలోనే పవన్ కోల్పోవటం ఖాయమనే ప్రచారం తాజాగా మొదలైంది

 

ఇంతకీ విషయం ఏమిటంటే వివాదాస్పద సినీ విమర్శకుడు, ప్రత్యేకించి పవన్ ను నీడలాగ వెంటాడుతున్న కత్తి మహేష్ తొందరలోనే బిజెపిలో చేరబోతున్నట్లు సమాచారం. కత్తి మహేష్ అంటే కొత్తగా ప్రచారం అవసరం లేదు. ఎలాగంటే పవన్ సినిమాల్లోని లోపాలను చీల్చి చెండాడుతుంటాడు. సరే చాలా సార్లు మహేష్ ఓవర్ గా వెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయి లేండి.

 

విషయం ఏదైనా కానీండి సినిమాల పరంగానే కాకుండా రాజకీయంగా కూడా పవన్ ను మహేష్ దారుణంగా  వెంటాడుతున్నాడనే చెప్పాలి. ఈ నేపధ్యంలోనే  మహేష్ కు పవన్ ఫ్యాన్స్ కు మధ్య చాలా సార్లు సోషల్ మీడియాలో  భీకరమైన యుద్ధాలే జరిగాయి. టివి చర్చల్లో మహేష్ కనబడితే చాలు పవన్ ఫ్యాన్స్ రెచ్చిపోయి ఫోన్లు చేసి అమ్మనాబూతులు తిట్టిన సందర్భాలకు లెక్కేలేదు. దాంతో పవన్-మహేష్ మధ్య పెద్ద వారే నడుస్తోంది.

 

ఇటువంటి నేపధ్యమున్న మహేష్ తొందరలోనే కమలం పార్టీలో చేరబోతున్నారట. చూడబోతే పనవ్ బిజెపితో పొత్తు పెట్టుకున్నాడనే మహేష్ బిజెపిలో చేరాలని నిర్ణయం తీసుకున్నట్లుంది. బిజెపిలో చేరిన తర్వాత ఊరికే ఉంటాడా ? పవన్ పై బాణాలు ఎక్కుపెట్టకుండానే ఉంటాడా ?  అసలే పవన్ తమ పార్టీలో చేరటం కొందరు నేతలకు ఏమాత్రం ఇష్టం లేదట. దాంతో వాళ్ళతో చేరి పవన్ వ్యతిరేక కార్యక్రమాలు చేసినా ఆశ్చర్యం లేదు. తన బద్ధ శతృవు బిజెపిలో చేరుతున్నాడంటే పవన్ కు మనశ్శాంతుంటుందా ?  మరి ఈ విషయంలో పవన్ ఎలా రియాక్టవుతాడో  చూడాల్సిందే.

 

మరింత సమాచారం తెలుసుకోండి: