మీడియా అంటేనే ప్రజల సమస్యలు ప్రతిబింబించేది.. అందులో సందేహమే లేదు.. కానీ ఏ ప్రజల సమస్యలు ప్రతిబింబిస్తుంది.. మీడియా అన్ని వర్గాలనూ, అన్ని ప్రాంతాలను కవర్ చేస్తుందా.. లేక.. కొంత మందిపై ఎక్కువ ప్రేమ చూపిస్తుందా.. మీడియాకు అన్ని ప్రాంతాలు సమానమేనా.. లేదా కేవలం తనకు నచ్చిన ప్రజల సమస్యలే చూపిస్తుందా.. ఇదీ ఆలోచించాల్సిన విషయం.

 

ఔను నిజమే.. అమరావతి రైతులు ఆందోళన చేస్తున్నారు. దాదాపు నెల రోజులకుపైగానే వారు రోజూ ఆందోళన చేస్తున్నారు. మొత్తం రాజధాని ప్రాంతంలో 29 గ్రామాలు ఉన్నాయి. వీటిలో తుళ్లూరు, మందడం, వెలగపూడి.. ఈ మూడు గ్రామాల్లో రోజూ ఆందోళనలు జరుగుతున్నాయి. అమరావతి తరలింపును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఎల్లో మీడియాకు గత నెల రోజులుగా ఇంకా ఏ సమస్యలు, ఆందోళనలూ పట్టడం లేదు.

 

ఉదయం లేస్తూనే టీవీ ఛానళ్ల ముందు ఆయా గ్రామాల ప్రజల నిరసనలు ప్రత్యక్షమైపోతాయి. నిజమే ప్రజల సమస్య ఉన్నప్పుడు మీడియా ఫోకస్ చేయాలి.. కానీ మరీ ఇంతగానా.. రాష్ట్రంలో ఇంకా ఏ సమస్యా లేనట్టూ.. ఇంకా అసలు ఏమీ జరగనట్టు కేవలం అమరావతి చుట్టూనే ఎల్లో ఛానళ్లు చక్కర్లు కొడతాయా.. ఇదీ ఆలోచించాల్సిన విషయం.

 

ఓవైపు సంక్రాంతి పండుగ వచ్చింది. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతా వేడుకగా జరుపుకునే పండుగ. అసలు సంక్రాంతి రోజుల్లో.. ప్రయాణికుల కష్టాలు, ఆర్టీసీ, రైళ్ల దోపిడీ.. ప్రయాణికుల సమస్యలు, గ్రామాల్లో పల్లె సందడి.. కోడిపందేలు.. ఇలా ఎక్కువగా ఏటా ఈ ఇష్యూలు మీడియాలో ఫోకస్ అయ్యేవి. ఇప్పుడు కూడా అదే జరిగింది. కానీ.. అన్ని ఛానళ్లలో కాదు. అసలు ఎల్లో ఛానళ్లు పండుగనే పట్టించుకోలేదు. పండుగ రోజూ ఆందోళనలోనే అమరావతి రైతులు అంటూ.. ఫోకస్ చేశారు. రైతుల సమస్యలు నిజమే. అలాగని.. ఇక రాష్ట్రంలో ఏం జరిగినా ఎల్లో మీడియాకు పట్టదా..?

మరింత సమాచారం తెలుసుకోండి: