తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో పైచేయి సాధించేందుకు అన్ని రాజకీయ పార్టీలు ప్రచారాన్ని ఉధృతం చేశాయి. ఒక పార్టీని మరో పార్టీ విమర్శించుకుంటూ ముందుకు వెళుతున్నాయి. రాజకీయ నాయకుల మధ్య విమర్శలు కేవలం విధాన పరంగానే  కాకూండా వ్యక్తిగత దూషణల వరకు వెళ్తున్నాయి. నాయకులు ఒకరిని ఒకరు  విమర్శించుకుంటూ ప్రజల్లో పట్టు పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా నిజామాబాద్ బిజెపి ఎంపీ ధర్మపురి అరవింద్ పై స్థానిక టిఆర్ఎస్ ఎమ్మెల్యే గణేష్ గుప్తా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎంపీ అరవింద్ కు దమ్ముంటే అభివృద్ధిపై చర్చించేందుకు రేపు తనతో చర్చకు రావాలని సవాల్ విసిరారు.


 గణేష్ ఈ రేంజ్ లో ఎంపీ పై ఫైర్ అవ్వడానికి, ఈ ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరగడానికి కారణం నిజామాబాద్ మేయర్ సీటు ఎంఐఎం కు ఇచ్చేందుకు కేసీఆర్ అన్ని ఏర్పాట్లు చేశారని అరవింద్ విమర్శలు చేయడంపై గణేష్ ఈ విధంగా మండిపడ్డారు. ఎంపీ అరవింద్ గారు టిఆర్ఎస్ గెలుపును అప్పుడే ఒప్పుకున్నందుకు ధన్యవాదాలు అంటూ గణేష్ వెటకారం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో నిజామాబాద్ మేయర్ అభ్యర్థిగా టిఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ ఉంటారని, వేరొకరికి ఇచ్చే ఆలోచన లేదంటూ  ఈ సందర్భంగా ఆయన క్లారిటీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్ లోని అనేక  వార్డుల్లో పర్యటించిన ఆయన స్థానికంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. 


ఎన్నికల సమయంలో ఎంపీ అరవింద్ ను గెలిపిస్తే పసుపు బోర్డు తీసుకు వస్తాను అంటూ బాండ్ పేపర్ మీద రాసి రైతులకు హామీ ఇచ్చిన మాట మర్చిపోయారా అంటూ ఎద్దేవా చేశారు. బిజెపి నాయకులు వలే తాము తప్పుడు హామీలు ఇవ్వమని, ఏదైనా చెప్పి, చేసి చూపిస్తానంటూ చెప్పారు. ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే ఎంపీ అరవింద్ ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని, ఒకవేళ అరవింద్ చెప్పినట్టు కనుక జరిగితే కంఠశ్వర్చె గుడి వరకు ముక్కు నేలకు రాస్తానని గణేష్ సవాల్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: