చరిత్రలోకి ఒకసారి తొంగి చూస్తే జనవరి 18వ తేదీన ఎంతో మంది ప్రముఖులు జన్మించారు. మరి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరూ తెలుసుకుందాం రండి. 

 

 

 నాళం కృష్ణారావు జననం : సంఘ సంస్కర్త.. బాల సాహిత్య బ్రహ్మ అయిన  నాళం కృష్ణారావు.. 1881 జనవరి 18వ తేదీన జన్మించారు. గ్రంధాలయ స్థాపకుడు... పత్రికా సంపాదకులు... అంతేకాకుండా స్వతంత్ర ఉద్యమంలో కూడా... ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాడిన స్వతంత్ర సమరయోధులు. మానవ సేవ పత్రిక సంపాదకులు నాళం కృష్ణారావు. 

 

 

 సుందరం బాలచందర్ జననం : సుప్రసిద్ధ సంగీత విద్వాంసులు అయిన సుందరం బాలచందర్ 1922 జనవరి 18వ తేదీన జన్మించారు. పలు సినిమాలకు దర్శకత్వం వహించడంతో పాటు... సినిమాల్లో నటుడిగా కూడా సినీ ప్రేక్షకులకు కొసమెరుపు. సుందరం బాలచందర్ సుప్రసిద్ధ వీణ విధ్వాంసుడు. దక్షిణ భారతదేశానికి చెందిన దర్శకుడు ఈయన. 1956 సంవత్సరంలో ఈయన తెలుగులో దర్శకత్వం వహించిన... ఏది నిజం సినిమా... రాష్ట్రపతి ప్రశంసాపత్రం అందుకున్నది.

 

 

 వీరప్పన్ జననం : భారతదేశానికి చెందిన పేరుమోసిన బందిపోటు అయిన  వీరప్పన్  గంధపు చెట్లు.. ఏనుగు దంతాలు స్మగ్లింగ్  చేయడంలో సుప్రసిద్ధుడు.ఈయన  1952 జనవరి 18వ తేదీన జన్మించారు. కాగా పోలీసుల నుంచి తప్పించుకు తిరుగుతూ దేశవ్యాప్తంగా భారీ మొత్తంలో ఏనుగు దంతాలు గంధపు చెట్లను స్మగ్లింగ్ చేసిన బందిపోటు వీరప్పన్. భారతదేశంలోని ప్రతి ఒక్కరికి వీరప్పన్ కొసమెరుపు. స్మగ్లింగ్ తో పాటు ఎంతో మంది ని కిడ్నాప్ చేయడం చంపడం లాంటివి కూడా చేశాడు వీరప్పన్ . ఎంతో మంది రాష్ట్ర క్యాడర్ కు  సంబంధించిన వాళ్ళని కూడా హత్య చేశాడు. కాగా  వీరప్పన్  2004 సంవత్సరంలో చనిపోయారు. 

 

 వినోద్ కాంబ్లీ జననం : ప్రముఖ భారత మాజీ క్రీడాకారుడు వినోద్ కాంబ్లీ 1972 జనవరి 18వ తేదీన జన్మించారు. ఈయన  భారత జట్టులో చాలాకాలం పాటు కొనసాగారు. తన అద్భుతమైన ఆట ప్రదర్శనతో క్రికెట్ ప్రేక్షకులను అలరించారు వినోద్ కాంబ్లీ. 

 

 

 డేవిడ్ మైకేల్ బటిస్టా జననం  : ప్రముఖ రెస్లింగ్  క్రీడాకారుడు డేవిడ్  మైకేల్ బటిస్టా . 1969 జనవరి 18వ తేదీన జన్మించారు డేవిడ్ బటిస్టా . ప్రస్తుతం ప్రొఫెషనల్ రెస్లింగ్  క్రీడాకారుడిగా రిటైర్మెంట్ పొందాడు. ఈయన ఎన్నో హాలీవుడ్ సినిమాల్లో నటించి సినీ ప్రేక్షకులను ఎంతగానో అలరించారు. తన అద్భుతమైన యాక్షన్ తో అతడు కొట్టేవాడు బటిస్టా . వరల్డ్ రెస్లింగ్ ఎంటర్టైన్మెంట్ లో.. ఎన్నో రోజుల పాటు ప్రొఫెషనల్ రెస్లర్ గా  ఎంతో మంది ప్రేక్షకులను అలరించారు. ఇప్పటికీ రెస్లింగ్ అంటే  ఇష్టపడే వాళ్ళు చాలామంది. బటిస్టా  వస్తున్నాడంటే రెస్లింగ్ ని  ఎంతో ఎంజాయ్ చేస్తూ ఉంటారు ప్రేక్షకులు. 1999 సంవత్సరంలో బటిస్టా రెస్లింగ్  వృత్తిని మొదలుపెట్టాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: