స్మార్ట్ ఫోన్ల వాడకం రోజురోజుకూ పెరిగిపోతున్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం అసలు స్మార్ట్ఫోన్ లేనిది మనిషి బతకడం లేదు అనడంలో అతిశయోక్తి లేదు. రోజురోజుకు స్మార్ట్ ఫోన్ వాడకం పెరగడం కాదు స్మార్ట్ ఫోన్ కి బానిస అయిపోతున్నాడు మనిషి. మార్కెట్లోకి కూడా సరికొత్త స్మార్ట్ ఫోన్లు  వస్తూనే ఉన్నాయి. తక్కువ ధరలకే ఎక్కువ ఫీచర్లు ఇస్తూ మార్కెట్లో ఎన్నో మొబైల్ కంపెనీలు స్మార్ట్ ఫోన్లను తయారు చేస్తూ పోటీ పడుతున్నాయి. వినియోగ దారులను ఆకర్షించడం లక్ష్యంగా ఎన్నో ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఇక అటు వినియోగదారులు కూడా బ్రాండెడ్ ప్రీమియం ఉన్న ఫోన్ లోనే ఎక్కువగా కొంటున్నారు. తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు వచ్చేలా చూసుకుంటున్నారు. 

 

 

 కొత్త ఫోన్ కొన్నాము  అంటే ఆ ఆనందమే వేరు ఉంటుంది కదా. కొత్త ఫోన్ కొన్నాక  ఎన్నో యాప్ లు  డౌన్లోడ్ చేసి పెట్టుకుంటూ ఉంటాం. అయితే మన ఫోన్లో ఉండే చాలా యాప్స్ లు ఉన్నప్పటికీ  మనం రోజూ వాడే యాప్స్  కొన్ని మాత్రమే ఉంటాయి. ఫోన్ లో మాత్రం మెమరీ మొత్తం నిండిపోయేలా రక రకాల యాప్స్  కనిపిస్తూ ఉంటాయి. ఇలా ఎక్కువగా యాప్స్ ఉండటం వల్ల ఫోన్ లు   హ్యాంగ్ అవుతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఇక ఆ తర్వాత... అసలు మన ఫోన్లో ఉన్న యాప్స్  అన్ని మనం వాడుతున్నామ అనే ఒక ఆలోచన వచ్చి  చూస్తే మాత్రం... మన మొబైల్ ఫోన్లో ఉన్న యాప్స్ లో  కేవలం 20 శాతం మాత్రమే మనం రోజు వాడుతూ ఉంటాం.. ఇక మిగితావి  ఎప్పుడో ఒకసారి చుట్టపు చూపుగా వాడుతూ ఉంటాం. 

 

 

 అయితే ఫోన్ లో ఉండే కొన్ని యాప్స్ ద్వారా  మొబైల్ వినియోగదారుల ప్రైవసీ కి  భంగం కలిగే అవకాశం ఉంది. అందుకే మొబైల్ లో కొన్ని యాప్స్ ని ఉంచుకోకూడదు  ఇంతకీ అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. కార్ రేసింగ్ 2019, ఫోర్ కే వాల్ పేపర్, బిగ్ ఫిష్ ఫ్రెంజి , క్లాక్ ఎల్ఈడి, 4కె బ్యాక్గ్రౌండ్ హెచ్డీ, క్యూఆర్  కోడ్ రీడర్  బార్  కోడ్ స్కానర్ ప్రో , ఫైల్ మేనేజర్ ప్రో... ఇలాంటి యాప్స్  మీ మొబైల్ లో ఉంటే వెంటనే తొలగించండి. లేకపోతే మీ ప్రైవసీకి బంగం కలిగి మొబైల్ నుంచి డాటా దొంగిలించే అవకాశం ఉందని పలువురు చెబుతున్నారు. అంతేకాకుండా ఈ యాప్స్ మొబైల్ లో ఉండడం వల్ల మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ కూడా చాలా నెమ్మదిస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: