దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని పరుగులు పెట్టించాలని చూస్తున్న ఆ పార్టీ అధిష్టానం ఒక్కో రాష్ట్రంలో పార్టీకి పునర్వైభవం తీసుకువచ్చే ఈ విధంగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే ఏపీలో లో టీపీసీసీ అధ్యక్షుడి నియామకం చేపట్టింది. ఏపీ పిసిసి అధ్యక్షుడిగా ఉన్న రఘువీరా రెడ్డి ఆ పదలో కి రాజీనామా చేయడంతో చాలాకాలంగా ఆ పదవి ఖాళీగా ఉంటూ వస్తోంది. అప్పటి నుంచి వెతుకులాట మొదలుపెట్టిన కాంగ్రెస్ అధిష్టానం చివరికి మాజీ మంత్రి సాకే శైలజానాథ్ కు ఆ పదవిని కట్టబెట్టింది. ఇప్పుడు తెలంగాణాలో అదే విధంగా పిసిసి అధ్యక్షుడిని అతి తొందర్లోనే నియమించే విధంగా కసరత్తు చేస్తోంది.


 దీనికోసం ఇప్పటికే అనేక మంది నాయకుల పేర్లను పరిశీలించింది. ఈ పేర్లలో ప్రముఖంగా టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ గా, మల్కాజ్ గిరి ఎంపీ గా ఉన్న రేవంత్ రెడ్డి పేరు, ఆ తర్వాత మాజీ మంత్రి చిన్నారెడ్డి, మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి, ఏఐసిసి కార్యదర్శి సంపత్ కుమార్ ఇలా అనేక పేర్లు పరిశీలనలోకి వస్తున్నాయి. అయితే ఈ పేర్లలో ఎవరి పేరును అధిష్టానం ఫైనల్ చేస్తుందో అన్న ఉత్కంఠ అందరిలోనూ ఉంది. అయితే టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి కి ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. 


కాంగ్రెస్ కు ప్రధాన రాజకీయ ప్రత్యాదిగా ఉన్న టిఆర్ఎస్ పార్టీని దీటుగా ఎదుర్కోవడంలో రేవంత్ రెడ్డి సమర్థవంతంగా పని చేస్తున్నారని అధిష్టానం భావిస్తోంది. అలాగే గడిచిన అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సీఎం అభ్యర్థిగా ప్రచారం పొందారు. అయితే ఆ ఎన్నికల్లో అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ  ఓటమి చెందడంతో రేవంత్ నిరాశ చెందారు. వచ్చే ఎన్నికల నాటికి టిఆర్ఎస్ హవా బాగా తగ్గి  కాంగ్రెస్ హవా బాగా పెరుగుతుందని ఆ పార్టీ నాయకులు భావిస్తున్న తరుణంలో టీ పిసిసి పదవికి డిమాండ్ పెరిగింది. 


ఒకవేళ రేవంత్ కి ఆ పదవి దక్కకపోతే మాజీ మంత్రి చిన్నారెడ్డి కి ఆ పదవి కట్టబెట్టేందుకు అధిష్టానం తీవ్రంగా ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే రేవంత్ రెడ్డికి టిపిసిసి పదవి  ఇవ్వొద్దు అంటూ సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఇప్పటికే అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్టు సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: