ప్రపంచంలో ప్రతి ఒక్కరిని ఐసిస్ భయపెడుతున్నది.  ఐసిస్ నుంచి తప్పించుకోవడానికి చాలా దేశాలు ప్రయత్నాలు చేస్తున్నాయి.  వాటి క్రూరమైన విధానం కారణంగా ప్రజలు ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు.  దైవం పేరుతో అనాగరికమైన చర్యలు చేపడుతున్నారు.  మనుషుల్ని దారుణంగా వేటాడుతున్నారు.  అయితే, ఐసిస్ ఉగ్రవాద చర్యలను అణిచివేసేందుకు చాలా దేశాలు కంకణం కట్టుకున్నాయి.  ఇప్పటికే చాలా చోట్ల వాటిని అణిచివేస్తున్నారు.  


ఇంకా వాటి మూలాలు మాత్రం ఎక్కడో ఒకచోట ఉంటూనే ఉన్నాయి.  ఐసిస్ చీఫ్ ను ఇటీవలే హతమార్చారు.  అతని మరణం తరువాత తగ్గిపోతాయి అనుకుంటే మరింత ఎక్కువయ్యాయి.  ఆఫ్రికా దేశంలో వీటి ఆధిపత్యం పెరిగిపోతున్నది.  సిరియా దేశంలో కూడా ఐసిస్ ఉగ్రవాదులు దాడులు చేస్తున్నారు.  ఇక ఇదిలా ఉంటె, ఐసిస్ కు సపోర్ట్ చేస్తున్న వ్యక్తులు ఇరాక్ దేశంలో కూడా  చాలా మంది ఉన్నారు.  వాళ్లలో చాలావరకు ఉగ్రవాదులను తమ మాటలతో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తుంటారు.  


అలా రెచ్చగొట్టే వ్యాఖ్యలతో రెచ్చగొడుతూ... ప్రజలపైకి పంపుతుంటారు.  అలాంటి వాళ్లలో ఒకరు షిఫల్ నిమ.  ఈయన ఐసిస్ ప్రబోధకుడిగా పనిచేస్తున్నారు.  చాలా కాలంగా ఈయన్ను పట్టుకోవడానికి ఇరాక్ ప్రయత్నం చేస్తున్నది.  ఎట్టకేలకు ఆయన ఆచోకీ దొరికింది.  నిమ ఇంటికి చూసి షాక్ అయ్యారు.  కారణం నిమ ఆకారం.  దాదాపుగా 130 కేజీలకు పైగా ఉన్న నిమ భారీ ఆకారం చూసి షాక్ అయ్యారు.  నిమను అరెస్ట్ చేసి తీసుకెళ్లడానికి నానా తంటాలు పడ్డారు.  


మాములు జీబులు అయన పట్టలేదు.  అయితే, ఎట్టకేలకు ఆయన కోసం ఓ పెద్ద భారీ ట్రక్ తీసుకొచ్చి అందులో ఎక్కించుకొనితీసుకెళ్లారు.  ట్రక్ లో ఎక్కించే సమయంలో కూడా పాపం చాలా ఇబ్బందులు పడ్డారు.  ఎలాగైతేనేం మొత్తానికి ప్రభోదకుడిని కూడా అరెస్ట్ చేశారు.  ఇంట్లో నుంచి బయటకు రాకుండా తింటూ కూర్చునే సరికి అయన ఏస్థాయిలో బరువు పెరిగిపోయారు.  ఇప్పుడు నిమపై ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదు.  ఆ ఆకారానికి కొన్ని రోజుల్లో ఆయనే మరణిస్తాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: