వాహనదారులు అందరూ ట్రాఫిక్ రూల్స్ తప్పనిసరిగా పాటించాలి... లేకపోతే జరిమానాలు తప్పవు... పోలీసులు ఎన్ని అవగాహన చర్యలు చేపట్టినప్పటికీ.. వాహనదారులకు ఎన్నిసార్లు సూచనలు చేసినప్పటికీ... ఎన్నిసార్లు జరిమానాలు విధించినప్పటికీ.. వాహనదారులు తీరులో  మాత్రం మార్పు రావడం లేదు. ట్రాఫిక్ రూల్స్ ని పాటించకుండానే వాహనం నడుపుతూ భారీ జరిమానాలు కడుతూ ఉన్నారు. ఇక ట్రాఫిక్ రూల్స్ పాటించ కుండా  పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ఎక్కువ ప్రయత్నాలు చేస్తున్న వాహనదారులు కూడా ఎక్కువమందే. ఇక హెల్మెట్ ధరించకుండా వాహనాలు నడపడానికి ఎక్కువగా వాహనదారులు ఇష్టపడుతుంటారు. 

 

 కారణం  హెల్మెట్ ధరించడం వల్ల హెయిర్ స్టైల్ చెరిగిపోతుందని కొంతమంది... హెల్మెట్ ధరించడం ఇష్టంలేక ఇంకొంతమంది... హెల్మెట్ ధరించకుండా వాహనాలు నడుపుతూ ఉంటారు. ఇంకేముంది పోలీసులకు దొరికారూ అంటే భారీగా ఫైన్లు వేస్తూ ఉంటారు పోలీసులు. అయినప్పటికీ కూడా వాహనదారుల తీరులో మాత్రం మార్పు రాదు. హెల్మెట్ ధరించకుండా  పోలీసుల నుంచి ఎలా తప్పించుకుందామా  అని ఆలోచిస్తారు తప్పా హెల్మెట్ ధరించి వాహన నడపాలి  అనే ఆలోచన మాత్రం రాదు చాలామందికి. ఇక ఇప్పటికే రోజురోజుకు ట్రాఫిక్ రూల్స్ ని పోలీసులు బాగా స్ట్రిక్ట్  చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో వాహనదారులు ఎంత తప్పించుకోవాలని ప్రయత్నించిన జరిమానాలు పడక తప్పడం లేదు. 

 

 కాగా  హెల్మెట్ ధరించని  వాహనదారులకు మధ్యప్రదేశ్ పోలీసులు ఓ వింత శిక్షను  విధిస్తున్నారు . హెల్మెట్ ధరించాలని ఎన్ని సార్లు చెప్పిన వాహనదారుల్లో  మార్పు రాకపోవడంతో... హెల్మెట్ ను ఎందుకు పెట్టుకోలేదో  చెబుతూ 100 పదాలతో పేపర్ పై వ్యాసాలు రాయిస్తున్నారు పోలీసులు. జనవరి 11 నుంచి 17 వరకు నిర్వహించిన రహదారి భద్రతా వారోత్సవాల్లో భాగంగా... ఈ వింత శిక్షను అమలు చేశారు ట్రాఫిక్ పోలీసులు. ఈ వింత శిక్షను పలువురు వాహనదారులపై అమలు చేసి సత్ఫలితాలను పొందారు. అయితే 100 పదాలతో పేపర్ పై వ్యాసాలు రాయడం ద్వారా కొంతమంది వాహనదారుల్లో  కూడా మార్పు వచ్చిందని పోలీసులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: