గత కొన్ని నెలల క్రితం 23 ఏళ్ల నిర్భయ అనే యువతిని ఆరుగురు మృగాల్లాంటి మగాళ్ళు అతి దారుణంగా సామూహిక అత్యాచారం చేసిన విషయం తెలిసిందే. సామూహిక అత్యాచారం చేసిన అనంతరం ఆ యువతి మర్మంగాల్లోకి  పదునైన వస్తువులు జొప్పించడం తో యువతి తీవ్ర గాయాలపాలై చికిత్స పొందుతూ మరణించింది. కాగా  ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీంతో ఈ ఘటనపై దేశవ్యాప్తంగా తీవ్రస్థాయిలో నిరసనలు వెల్లువెత్తాయి. వి వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు వినిపించాయి. కేంద్ర ప్రభుత్వం కూడా నిర్భయ కేసులో ఆరుగురు నిందితులను శిక్షించేందుకు ప్రత్యేకంగా నిర్భయ చట్టాన్ని కూడా తీసుకు వచ్చింది. 

 

 

 కానీ ఇప్పటికీ నిర్భయ కేసులో ని నిందితులకు ఇన్నేళ్లు  అయినప్పటికీ ఇంకా ఉరి శిక్ష మాత్రం పడలేదు. ఇకపోతే నిర్భయ కేసులో ఆరుగురు నిందితుల్లో ఒక నిందితుడు మైనర్ కావడంతో మూడేళ్ల జైలు శిక్ష విధించింది కోర్టు... ఇక మరో నిందితుడు జైలులో శిక్ష అనుభవిస్తున్న సమయంలో ఆత్మహత్య చేసుకున్నాడు ప్రస్తుతం ఉన్న నలుగురు నిందితులకు పటియాలా  హౌస్ కోర్టు ఉరిశిక్ష విధిస్తూ డెత్  వారెంట్లను జారీ చేసింది. కాగా  నిర్భయ కేసులో ని నలుగురు నిందితులను ఫిబ్రవరి 1న విడుదల చేయనున్నారు. ఇకపోతే నిర్భయపై అత్యాచారం ఘటన జరిగిన నాటి నుంచి ఇప్పటివరకు నిందితులకు ఉరిశిక్ష పడే విధంగా నిర్భయ తల్లి పోరాటం చేస్తూనే ఉన్న విషయం తెలిసిందే ఈ క్రమంలోనే నిర్భయ తల్లి ఎంతో గుర్తింపు సంపాదించింది. 

 

 

 ఇకపోతే నిర్భయ కేసులో నిందితులకు మన శిక్షపడేలా పోరాడుతూ  గుర్తింపు సంపాదించిన నిర్భయ తల్లి ఇంకొన్ని రోజుల్లో రాజకీయాల్లోకి వెళ్తుందని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే  కాంగ్రెస్ నేతలు నిర్భయ తల్లి ఆశ దేవి తో సంప్రదింపులు జరుపుతున్నారని ఇంకొన్ని రోజుల్లో ఆమె రాజకీయాల్లోకి వెళ్లి పోతుంది అంటూ ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై స్పందించిన నిర్భయ తల్లి ఆశ దేవి... తనకు రాజకీయాలపై ఆసక్తి లేదని... కాంగ్రెస్ నేతలు కానీ మరే ఇతర  పార్టీ నేతలు కాని తనను రాజకీయాల్లోకి రావాలంటూ సంప్రదించలేదు అంట స్పష్టం చేశారు. ఇన్ని రోజులు తన కుమార్తె కు న్యాయం జరగాలనే  ఆకాంక్షతోనే పోరాడుతున్నాను  అంటూ తెలిపారు. అయిన  తాను రాజకీయాల్లోకి వెళ్తున్నాను అంటూ ఎలా ప్రచారం చేస్తున్నారో అర్థం కావడం లేదు అంటూ ఆమె వ్యాఖ్యానించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: