జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి మొదట ప్రవేశించిన తర్వాత టీడీపీతో పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే.ఇక ఆ తర్వాత టీడీపీతో పవన్ కళ్యాణ్ కు చెడింది . దీంతో 2019 ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేశారు పవన్ కళ్యాణ్. 2019 ఎన్నికల్లో ఘోర ఓటమి చవి చూశారు. పోటీ చేసిన రెండు స్థానాల్లో ఘోర ఓటమి పాలయ్యారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్  ఏకంగా జనసేన పార్టీకి  ఒక ఎమ్మెల్యే మాత్రమే ఎన్నికల్లో విజయం సాధించారు. అయినప్పటికీ అధికార పార్టీపై తీవ్ర  స్థాయిలో విమర్శలు చేస్తూ ఆంధ్ర రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి పవన్ కళ్యాణ్ చర్చనీయాంశంగా మారారు. మొన్నటికి మొన్న ఢిల్లీకి వెళ్లి ఢిల్లీ పెద్దలతో మాట్లాడిన పవన్ కళ్యాణ్ తాజాగా బీజేపీతో కలిసి నడవాలని నిర్ణయించారు. 

 

 

 బీజేపీతో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేయాలని పార్టీ నిర్ణయించినట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. బిజెపి జనసేన పొత్తు పై వైసీపీ ఎమ్మెల్యే రోజా తాజాగా విమర్శలు గుప్పించారు. ప్యాకేజీల పవన్ కళ్యాణ్ పొత్తుల పవన్ కళ్యాణ్ గా మారిపోయాడు అంటూ విమర్శించారు నగరి ఎమ్మెల్యే రోజా. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆమె ఈ విమర్శలు గుప్పించారు. పొత్తులు ఫ్యాకేజీల కోసమే పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టినట్టు ఉన్నారు అంటూ ఎద్దేవా చేసారు  రోజా. పాచిపోయిన లడ్డూలు ఇప్పుడు తాజాగా మారయ అంటూ విమర్శించారు. ఏపీకి ప్రత్యేక హోదా కావాలంటూ గతంలో పోరాటం చేసిన పవన్ కల్యాణ్ తాజాగా పోరాటం ఎందుకు ఆపారో  చెప్పాలి అంటూ నిలదీశారు రోజా. 

 

 

 జగన్మోహన్ రెడ్డి ని ఎలా ఎదుర్కోవాలో తెలియక విపక్ష పార్టీలు అన్ని ఏకమైపోతున్నాయి అంటూ పేర్కొన్నారు రోజా. ఎన్ని పార్టీలు ఏకమైనా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని  ఏమి చేయలేరు అంటూ రోజా తెలిపారు. సినిమాల్లో పాత్రలు మార్చినట్లు గానే పవన్ కళ్యాణ్ పార్టీలు మారుస్తున్నారు అంటూ విమర్శించారు. పవన్ కళ్యాణ్ లాంటి వారు యూత్ ఐకాన్ ఎప్పటికీ కాలేరని పేర్కొన్నారు నగరి ఎమ్మెల్యే రోజా. బ్యాంకులో డబ్బులు ఎగ్గొట్టిన సిఎం రమేష్ సుజనా తో పాటు.. పవన్ కళ్యాణ్ ను  కూడా ఎందుకు బిజెపి లోకి తీసుకున్నారో  అర్థం కావడం లేదని రోజా వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ బీజేపీతో పొత్తు పెట్టుకోవడం ఆంధ్ర రాజకీయాల్లో  ఆసక్తికరంగా మారిన  విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: