దిశ దోషుల ఎన్‌ కౌంటర్.. దేశాన్ని కుదిపేసిన ఘటన.. ఆడపిల్ల ఒంటరిగా రాత్రి వేళ కనిపిస్తే.. మృగాళ్లుగా మారిన మగాళ్లను పిట్టల్లా కాల్చేసిన పోలీసులకు దేశమంతా జేజేలు కొట్టిన ఘటన.. నలుగురిని చంపితే సంబరాలేంటి..? మానవ హక్కుల సంగతేంటి..? అంటూ అప్పట్లో కొందరు వాదించారు. దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై జాతీయ మానవ హక్కుల సంఘం సుమోటోగా స్పందించింది.

 

ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చి.. దిశ దోషుల ఎన్ కౌంటర్ తీరుపై ఆరా తీశారు. శవాలను మళ్లీ రీపోస్టు మార్టం చేయించారు. మానవ హక్కుల కోసం ఆ తపన స్వాగతించాల్సిందే.. మరి.. నిర్భయ దోషుల సంగతేంటి..? నిర్భయ అత్యాచార ఘటన అప్పట్లో దేశాన్ని కుదిపేసింది. ఓ అమ్మాయిని అత్యంత దారుణంగా, పైశాచికంగా అత్యాచారం చేసిన ఉదంతం సంచలనం రేపింది. అత్యాచారంతో ఆగక.. మర్మాంగాల్లో రాడ్డులు దింపి పైశాచికానందం పొందిన ఆ నరరూప రాక్షసులు.. ఆ అరాచకం జరిగిన 8 ఏళ్ల తర్వాత కూడా ఇంకా ఊపిరితోన ఉన్నారు.

 

మరి ఇదెక్కడి న్యాయం. ఎందుకింత ఆలస్యం.. జస్టిస్ డిలేయిడ్‌ ఈజ్ జిస్టిస్ డినేయిడ్ అని ఓ నానుడి.. ఈ దేశానికి వినిపించదా.. ఆడపిల్ల ఆత్మ ఘోష ను పట్టించుకునే పాలకులే లేరా.. అత్యంత పైశాచికంగా అత్యాచారం చేసిన ఈ కేసు దేశంలోనే ఓ అరుదైన ఘటనగా నమోదైంది. కనీసం ఈ కేసులోనైనా సత్వర న్యాయానికి ఆస్కారం లేదా..? అత్యాచారం జరిగిన కొన్ని రోజులకే నిందితులంతా దొరికారు.

 

కానీ విచారణ పర్వం ఏళ్ల తరబడి సాగింది. చివరకు అన్ని విచారణలు ముగిసి రెండేళ్ల క్రితమే ఆ కీచకులకు ఉరిశిక్ష పడింది. అయినా వాళ్లు ఇంకా ఊపిరితోనే ఉన్నారు. ఎందుకు.. అత్యంత కిరాతకమైన ఈ కేసులో కూడా నిబంధనలను మార్చలేరా.. ఓ ఆడపిల్లకు సత్వరం న్యాయం అందించలేని ఈ పాలకులెందుకు.. ఈ రాజ్యాంగం ఎందుకు.. ఈ నిబంధనలు ఎందుకు.. ? ఈ నిబంధనలు మార్చడానికి ఇబ్బందేంటి..? ఆ నిర్భయ ఆత్మఘోష ఈ దేశానికి పట్టదా.. ? ఇవన్నీ చూస్తుంటే దిశ దోషుల ఎన్‌ కౌంటర్ కరెక్టే అనిపించడంలో తప్పేముంది..?

మరింత సమాచారం తెలుసుకోండి: