జియన్ రావు కమిటీ, బోస్టన్ కమిటీ నివేదికలపై హై పవర్ కమిటీలో చర్చించిన అంశాలను ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డికి వివరించామని రాష్ట్ర సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. వెనుక బడిన ప్రాంతాల అభివృద్ధిపై ఇరు కమిటీలు ఇచ్చిన నివేధికలపై సీఎం జగన్ కు వివరించామన్నారు. రాజధాని గ్రామాల రైతుల ఆందోళనలపైన కూడా ముఖ్యమంత్రి జగన్ దృష్టి తీసుకెళ్లామని చెప్పారు. రైతులకు గతంలో చేసిన ఒప్పందాలతో పాటు మరింత మేలు చేసేలా ఉండాలని సీఎం జగన్ సూచించారని మంత్రి బొత్స పేర్కొన్నారు. 

రైతుల అభ్యంతరాల తీసుకోవడంలో సాంకేతిక లోపం ఉందనడంలో వాస్తవం లేదని మంత్రి సత్యనారాయణ కొట్టిపారేశారు. రైతులతో చర్చిండానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. రాజదాని గ్రామాల రైతులు కొందరు  న్యాయం చెయ్యమని కోరారని చెప్పారు. చెన్నై ఐఐటీ ఎటు వంటి నివేదికలను ఇవ్వలేదని స్పష్టం చేశారు. ఈ విషయంలో కొన్ని పత్రికలు కావాలని దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. ఐఐటీ ఇచ్చిన నివేదికపై మా ఆధారాలు ఉన్నాయన్నారు. బిసిజి రిపోర్ట్ లో సైతం అక్కడి వాస్తవ పరిస్థితులను నివేదికలో చెప్పిందని ఈ సందర్బంగా గుర్తు చేశారు. 
చంద్రబాబు చెప్పినట్లు అది శాశ్వత సచివాలయం అయితే తాను తల దించుకుంటానాని మంత్రి బొత్స అన్నారు. వెలగపూడిలో నిర్మించింది శాశ్వత సచివాలయం అయితే మరి నెలపాడు వద్ద మరో సచివాలయానికి ఎందుకు శంకుస్థాపన  చేశారని నిలదీశారు. 25 శాతం నిర్మాణాలు జరిగిన ప్రతి భవనాన్ని పూర్తి చేస్తామన్నారు. రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులను ఆదుకుంటామని చెప్పారు.13 జిల్లాల అభివృద్ధితో పాటు అమరావతి అభివృద్ధి కూడా జరుగుతుందని అన్నారు. రాజదానిపై మాకు పూర్తి స్పష్టత  ఉందని స్పష్టం చేశారు. అమరావతిని రాజధానిగా చెప్పిన చంద్రబాబు  5 ఏళ్ళలో ఎందుకు గెజిట్ ఇవ్వలేదన్నారు.

రైతులను ఆందోళనలు చేయొద్దని చెపుతున్నామని చెప్పారు. రాజధాని కోసం కలెక్ట్ చేసిన నిధులు ఏమైయ్యాయని ప్రశ్నించారు. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా జోలీ పట్టిన ఫండ్స్ ఎవరికి ఇచ్చారని అడిగారు. రాజదానిపై జనసేన పార్టీ అధినేత  పవన్ కళ్యాణ్ ఇప్పడు జ్ఞానోదయం అయిందా అని ప్రశ్నించారు. ప్రతి పక్షం, విపక్షం  ఎవరితో కలిసిన  మాకు అభ్యంతరం లేదన్నారు. మూడు రాజదానులపై  పవన్ వైఖరి ఎంటో ఇప్పటి వరకు స్పష్టత లేదు. పవన్ కల్యాణ్ రాజకీయాల్లో క్లారిటీ లేని వ్యక్తి. బీజేపీ,జనసేన పొత్తు రాజకీయ  ఉనికి  కోసమే. 2024లో అధికారంలోకి వస్తామని చెప్పడానికి పవన్, కన్నాలేమన్న జోతిష్యులా అని ప్రశ్నించారు. ప్రతిపక్ష, విపక్ష పార్టీలు కలవడం విడిపోవడం సహజమేనన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: