"రాజధాని తరలింపు అన్నది కేవలం రాజధాని గ్రామాల సమస్య మాత్రమే కాదు.. ఇది 13 జిల్లాల ప్రజల సమస్య. ఇది రాష్ట్ర ప్రజలందరి సమస్య. దీనిపై అంతా పోరాడాలి. ఇక మనకు సంక్రాంతి లేదు.. భోగి రోజు.. జీఎన్నార్‌ కమిటీ, బీసీజీ నివేదిక అన్నీ భోగి మంటల్లో తగుల బెట్టండి.. ఈ సంక్రాంతిని అమరావతి సంక్రాంతిగా జరుపుకుందాం.. అసలు పండుగ చేసేకునే సమయం కాదు. రాష్ట్రం క్లిష్టపరిస్థితుల్లో ఉంది.. "

 

ఇదీ జీఎన్ రావు కమిటీ నివేదిక, బోస్టన్ గ్రూప్ నివేదికలు వచ్చిన సమయంలో తెలుగదేశం అధినేత చంద్రబాబు చేసిన హాహా కారాలు. కేవలం అలా అనడమే కాదు.. ఎన్నడూ జనంలోకి రాని తన భార్య భువనేశ్వరిని అమరావతి గ్రామాల్లో తిప్పారు. ఆమెతో ఉపన్యాసాలు ఇప్పించారు. ఆమె ప్లాటినం గాజులు ఉద్యమానికి విరాళంగా ఇచ్చారు. అబ్బే జనం నుంచి పెద్దగా స్పందన కనిపించలేదు.

 

ఓహో.. సీన్ ఇలా ఉందా.. ఎలాగైనా ఈ ఉద్యమాన్ని రాష్ట్రవ్యాప్తం చేయాలి అనుకున్నారు బాబు గారు. అనుకున్నదే తడవుగా.. జోలె కట్టి రాష్ట్రవ్యాప్తంగా తిరగడం మొదలుపెట్టారు. ముందు మచిలీపట్నం, ఆ తర్వాత రాజమండ్రి.. ఆ తర్వాత అనంతపురం జిల్లా ఇలా జనంలోకి వెళ్లి జోలె పట్టి రాజధాని ఉద్యమానికి విరాళాలు అడిగారు. టీడీపీ నేతలు, క్యాడరూ తప్ప జనం పెద్దగా పట్టించుకోలేదు.

 

అసలు చంద్రబాబు చేసిన హాడావిడిగా రాష్ట్రం ఏకం కావాలి. రాష్ట్ర రాజధానిని మారుస్తుంటే.. అది రాష్ట్ర ప్రజలకు ఇష్టం లేకపోతే.. ఎక్కడికక్కడ జనం నినదించాలి. రాస్తారోకోలు చేయాలి. ఆందోళనలు చేయాలి.. కానీ పాపం.. ఓవైపు చంద్రబాబు గొంతు చించుకుంటున్నా పట్టించుకునేవారే కరవయ్యారు. ఆయన పండగొద్దని చెబుతున్నా.. జనం సంబరంగా సంక్రాంతి జరుపుకున్నారు. అంటే బాబోరి కల్పిత ఉద్యమం ఉసూరనిపించినట్టేగా మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: