గత ఏడాది వర్షాలు విరివిగా కురవడంతో చలి గాలులు కూడా విపరీతంగా వీస్తున్నాయి. సంక్రాంతి పండగ అనంతరం కూడా చలి తీవ్రత ఎక్కువగా ఉంది. ఈ చలి గాలులకు ప్రజలు వణికిపోతున్నారు. దీంతో తెలంగాణ రాష్ట్రంలో చలి తీవ్రత మళ్లీ పెరుగుతోంది. రాత్రిపూట ఉష్ణోగ్రతలు కూడా బాగా తగ్గపోతుండటంతో చలి గాలులకు ప్రజలు వణికిపోతున్నారు. ఈశాన్య భారతం నుంచి తెలంగాణవైపు తేమగాలులు ఎక్కువగా వీస్తుండడంతో చలి ఎక్కువగా ఉంటోందని వాతావరణ శాఖ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.

 

 

ముఖ్యంగా రాష్ట్రంలోని మహబూబ్ నగర్, రంగారెడ్డి, నాగర్ కర్నూలు, భద్రాద్రి కొత్త గూడెం, కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో చలి తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. మరో వారం రోజులపాటు చలి తీవ్రత ఇలాగే కొనసాగడం ఖాయమని అధికారులు వెల్లడించారు. చాలిగాలులే ఇలా ఉంటే.. పగటి పూట ఉష్ణోగ్రతలు కూడా అధికంగానే నమోదవుతున్నాయి.  చాలా ప్రాంతాల్లో 10 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు కూడా నమోదయ్యాయి. కొన్నిచోట్ల ఉదయం 10 గంటల వరకూ దట్టమైన పొగమంచు అలుముకునే ఉంటోంది. ఈ వారం ప్రారంభంలో హైదరాబాద్‌లో తెల్లవారుజామున 17.7, ఆదిలాబాద్ జిల్లా భోరజ్‌లో 9.9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదవటం చలి తీవ్రతను తెలియజేస్తోంది.

 

 

ఆదిలాబాద్‌లో 10.7, హన్మకొండలో 14.5, నిజామాబాద్, రామగుండంలో 15 డిగ్రీల చొప్పున చలి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రం మొత్తం మీద ఈ వారాంతంలో కూడా అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశాలున్నాయని అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌లో కనిష్ఠ ఉష్ణోగ్రత 19 డిగ్రీలు నమోదు కాగా, గరిష్ఠ ఉష్ణోగ్రత 29 డిగ్రీలుగా నమోదు అయింది. రాబోయే వారంలో కూడా తెలంగాణ రాష్ట్రంలో కనిష్ఠ ఉష్ణోగ్రత 18 డిగ్రీలుగా, గరిష్ఠం 31-32 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: