బీజేపీతో జనసేనాని జతకట్టడం పట్ల ఇటు వైస్సార్ కాంగ్రెస్ పార్టీ , అటు వామపక్షాలు తీవ్ర విమర్శలే చేస్తున్నాయి . వామపక్ష పార్టీ లు పవన్ కళ్యాణ్ ను విమర్శిస్తున్నాయంటే ఒక అర్థముంది ... కానీ వైస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు విమర్శిస్తుందో అర్ధం కావడం లేదని రాజకీయ పరిశీలకులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు . జనసేనాని ఎవరి తో జట్టు కట్టిన తమకొచ్చే నష్టమేమి లేదంటూనే , ఆయన పై తీవ్ర స్థాయిలో రాజకీయ విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందని విమర్శిస్తున్నారు  . పవన్ కు వైస్సార్ కాంగ్రెస్ నేతలు  ఎందుకంత ప్రాధాన్యత ఇస్తున్నారన్నది అంతుచిక్కడం లేదని అంటున్నారు .

 

పవన్ తో పొత్తంటే కుక్క తోకపట్టుకుని గోదావరిని ఈదడమేనని నగరి ఎమ్మెల్యే రోజా తీవ్ర వ్యాఖ్యలే చేయడం చూస్తుంటే ఉద్దేశ్య పూర్వకంగానే టార్గెట్ చేసినట్లు కనిపిస్తోందని చెబుతున్నారు  .   పవన్ పొత్తుల కళ్యాణ్ , ప్యాకేజీ కళ్యాణ్ అని ... ప్యాకేజీల కోసమే పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టారని  , పొత్తులు పెట్టుకుని పవన్ పబ్బం గడుపుకుంటున్నారని రోజా వ్యక్తిగత విమర్శలు , ఆరోపణలు చేయడం వల్ల వైస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఒరిగేదేమి లేకపోగా , నష్టం జరిగే అవకాశముందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు . 

 

అయితే  పవన్ పై రోజా  ఎన్నయినా రాజకీయ విమర్శలు చేయవచ్చు కానీ ఒక పార్టీ తో ఆయన పొత్తు పెట్టుకోవడం పట్ల  ఆక్షేపణను వ్యక్తం చేయడం అర్థరహితమని రాజకీయ పరిశీలకులు అంటున్నారు . రాజకీయాల్లో పొత్తులు సహజమేనని , ఆ పొత్తుల పెట్టుకునే పార్టీల మధ్య ఉన్న సైద్ధాంతిక విబేధాలను ఎత్తిచూపితే హర్షించవచ్చు కానీ కేవలం వ్యక్తిగత విమర్శలు చేయడం వల్ల  ప్రజల్లోకి  తప్పుడు సంకేతాలు  వెళ్లే ప్రమాదం లేకపోలేదని అంటున్నారు  .

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: