జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా బిజెపి పార్టీతో పొత్తు పెట్టుకొని రాబోయే సార్వత్రిక ఎన్నికలకు సిద్ధమవుతున్న తరుణంలో ఏపీలో రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా మారిపోయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు ఒకపక్క అమరావతి చుట్టూ తిరుగుతుంటే మరోపక్క బిజెపి జనసేన పార్టీతో పొత్తు చుట్టూ జరుగుతున్నాయి. చాలా మంది పవన్ కళ్యాణ్ రాజకీయాలకు పనికిరాడు వాళ్లతో వీళ్ళతో పొత్తులు పెట్టుకోవడానికి తప్ప ప్రసంగాలలో అరుపులు కేకలు తప్ప మాటమీద నిలబడే మనిషి కాదు అని తాజాగా బీజేపీ తో జనసేన పార్టీ కలవడం పట్ల సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

 

2019 ఎన్నికల ప్రచారంలో చచ్చినా బ్రతికినా బిజెపి పార్టీ తో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదు అని కామెంట్ చేసిన పవన్ కళ్యాణ్ వీడియో ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ పవన్ కళ్యాణ్ బతుకు ఉన్నాడా చచ్చిపోయాడా అని కామెంట్లు చేస్తున్నారు ప్రత్యర్థి పార్టీకి చెందిన కార్యకర్తలు. ఇదిలా ఉండగా బిజెపి పార్టీ పవన్ కళ్యాణ్ ని అస్త్రంగా మలుచుకుని తెలుగుదేశం పార్టీలో అధికారంలో ఉన్న నాయకులను తన పార్టీలోకి లాక్కోవడానికి చంద్రబాబు పార్టీ ని ముంచేసే అద్భుతమైన స్కెచ్ బిజెపి పార్టీ నేతలు వేసినట్లు ఏపీ మీడియా వర్గాల్లో మరియు బిజెపి పార్టీలో టాక్ వినపడుతోంది.

 

ఇప్పటికే ప్రతిపక్ష హోదా కోల్పోయే పరిస్థితిలో ఉన్న చంద్రబాబు కి భవిష్యత్తులో బిజెపి మరియు పవన్ కళ్యాణ్ కూటమి గట్టిగానే రాజకీయంగా దెబ్బ కొట్టబోతున్నట్లు...2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపి తమకు వ్యతిరేకంగా ప్రచారం చేసిన చంద్రబాబుకి పవన్ కళ్యాణ్ తోనే ఆపరేషన్ ఆకర్ష కార్యక్రమం చేపట్టి తెలుగుదేశం పార్టీ దుకాణం మొత్తం సర్దడానికి కేంద్రంలో ఉన్న బిజెపి నేతలు మొత్తం స్కెచ్ సిద్ధం చేసినట్లు ఏపీ మీడియాలో వార్తలు చాలా గట్టిగా వినబడుతున్నాయి.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: