హైపవర్ కమిటీ ముఖ్యమంత్రి జగన్ ను కలిసిన తర్వాత ఆ వివరాలు మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాకు వివరించారు. ఆ సమయంలో విలేఖరులు మంత్రి బొత్సపై ప్రశ్నల వర్షం కురిపించారు. అందులో ఓ విలేఖరి.. సార్.. ఇప్పుడు మన రాజధాని ఏది సార్.. అని అడిగాడు. దీంతో మంత్రి బొత్స ఒక్కసారిగా సైలంటైపోయారు.

 

దాంతో ఆ ప్రశ్న అడిగిన విలేఖరి అహా.. మంత్రిని భలే ఇరుకున పెట్టేశాను కదా అని అనుకుని ఉండొచ్చు. కానీ ఇంతలో మంత్రి బొత్స తేరుకుని ఎదురు దాడి చేశారు. రాజధాని ఏదో చెబుతాం.. తొందర ఎందుకు.. సరే కానీ.. నన్ను ఈ ప్రశ్న భలేగా అడిగావ్.. బావుంది. కానీ.. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు.. అమరావతిని రాజధానిగా గుర్తిస్తూ గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వలేదు.. మరి అదెప్పుడైనా చంద్రబాబును అడిగావా..అని ఎదురు ప్రశ్నించారు. అమరావతి పేరును రాజధానిగా గుర్తిస్తూ గెజిట్ నోటిఫికేషనే ఇవ్వలేదన్న సంగతి నేను చెబితే కానీ మీకు ఎవరికీ తెలియలేదు. మరి మీరు ఎందుకు చంద్రబాబును ఈ ప్రశ్న అడగలేదు అంటూ నిలదీశారు మంత్రి బొత్స.

 

దీంతో సదరు రిపోర్టర్ బిత్తరపోయాడు. ఎందుకంటే మంత్రి బొత్స అడిగిన ప్రశ్న అక్షరాలా నిజం. వైసీపీ సర్కారు అధికారంలోకి వచ్చి మంత్రి బొత్స సత్యనారాయణ ప్రెస్ మీట్ పెట్టేవరకూ కూడా ఎవరికీ ఈ విషయం తట్టనే లేదు. పదేళ్లు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉండే అవకాశం విభజన చట్టం ద్వారా లభించింది. కానీ ఓటుకు నోటు పుణ్యమో.. ఏమో కానీ.. చంద్రబాబు రెండున్నరేళ్లకే చలో విజయవాడ అంటూ హైదరాబాద్ నుంచి తట్టాబుట్టా సర్దేసుకున్నారు. ఆ తర్వాత అమరావతే తమ రాజధాని అన్నారు. ఇంతా చేశారు కానీ.. దాన్ని గెజిట్ నోటిఫికేషన్ మాత్రం ఇవ్వలేదు. ఇప్పుడు అదే జగన్ పాలిట వరంగా మారుతోంది. మంత్రి బొత్స వేసిన ఈ ప్రశ్నతో మీడియా మిత్రులు సైతం అవును కదా.. అంటూ నాలిక్కరుచుకున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: