అమరావతి రాజధానిలో వైయస్ జగన్ తీసుకున్న వికేంద్రీకరణ నిర్ణయం పట్ల ఆ ప్రాంతంలో ఉన్న రైతులు మరియు చంద్రబాబు నాయుడు మరియు ఆయన కుటుంబ సభ్యులు ఇటీవల దీక్షలు, ధర్నాలు, నిరసనలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబు బామ్మర్ది హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఇంకా అమరావతి రాజధాని ప్రాంతంలో పర్యటించాక పోవడం పట్ల తీవ్రంగా విమర్శలు తెలుగుదేశం పార్టీలో వినబడుతున్నాయి. వాస్తవానికి  అమరావతి కోసం ఫైట్ చేస్తున్న రైతులకు తెలుగుదేశం పార్టీ ఎప్పటినుండో అండగా నిలిచింది. అలాగే రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షాలు అన్ని కూడా రాజధాని అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతులకు అండగా ఉంటున్నాయి. భరోసా ఇస్తున్నాయి.

 

జనసేన పార్టీ కూడా రైతులకు భరోసా ఇచ్చింది. పైగా జనసేన ఇప్పుడు బీజేపీతో కలిసి పొత్తు పెట్టుకోవడంతో తెలుగుదేశం పార్టీ షాక్ అయ్యింది. ఇటువంటి తరుణంలో బాలయ్యబాబు అమరావతి ప్రాంతంలో పర్యటించాలని ఇటీవల చివరిదాకా షెడ్యూల్ ఖరారు చేసుకున్న గాని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు బాలయ్య పర్యటన అడ్డుకున్నట్లు అంతర్గతంగా పార్టీలో వినబడుతున్న టాక్. మేటర్ లోకి వెళ్తే హై పవర్ కమిటీ నివేదిక సీఎం జగన్ చేతుల్లోకి వెళ్ళిన తర్వాత వైయస్ జగన్ తీసుకున్న నిర్ణయం తర్వాత బాలయ్యని అమరావతి రాజధాని ప్రాంతంలో ఆందోళనలు చేస్తున్నా పర్యటించే స్కెచ్ చంద్రబాబు వేసినట్లు సమాచారం.

 

ఈనెల 20వ తారీఖున ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో మూడు రాజధానులు గురించి అలాగే అమరావతి రాజధాని గురించి సీఎం జగన్ స్వయంగా క్లారిటీ ఇచ్చే అవకాశాలు ఉన్న నేపథ్యంలో చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మొత్తంమీద చూసుకుంటే రాజధాని అమరావతి ప్రాంతాలలో దీక్షలు, నిరసనలు, ఆందోళనలు చేస్తున్న రైతులకు సంఘీభావం తెలపడానికి బాలయ్యబాబు పర్యటనకు చంద్రబాబు అడ్డుపడినట్లు ఏపీ మీడియా వర్గాల్లో వినబడుతున్న టాక్.  

మరింత సమాచారం తెలుసుకోండి: