నెల రోజులకుపై ఆందోళన చేస్తున్న అమరావతి రైతులకు జగన్ దిమ్మ తిరిగే ప్యాకేజీ ఇవ్వబోతున్నారా.. అమరావతి రైతులు సైతం జగన్ కు జైకొట్టేలా వైసీపీ సర్కారు స్కెచ్ రెడీ చేసిందా.. ఎలాగూ రాజధాని తరలింపు తప్పదని తెలుసుకున్న రైతులను మంచి ప్యాకేజీ తో ఒప్పించేందుకు జగన్ సర్కారు ప్రయత్నం చేస్తోందా.. అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.

 

రాజధాని తరలింపు నిర్ణయంతో హాట్ హాట్ గా ఉన్న రైతులకు ఉపశమనం కలిగించేలా జగన్ సర్కారు ప్యాకేజీ రెడీ చేస్తోందని మంత్రి బొత్స సత్యనారాయణ మాటలను బట్టి తెలుస్తోంది. అమరావతి రైతులెవరూ కూడా అధైర్యపడొద్దని మంత్రి బొత్స సత్యనారాయణ హైపవ్ కమిటీ భేటీ తర్వాత సూచించారు. రైతుల సమస్యలను ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి దృష్టికి తీసుకెళ్లామని ఆయన తెలిపారు. సీఎం వైయస్‌ జగన్‌తో హై పవర్‌ కమిటీ భేటీలో సీఎం వైయస్‌ జగన్‌కు కమిటీ సభ్యులు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చిందట.

 

సీఎం సమక్షంలో హైపవర్‌ కమిటీ సభ్యులమంతా కలిశారు. హైపవర్‌ కమిటీ సమావేశాల వివరాలు సీఎంకు వివరించారు. ఉమ్మడి రాష్ట్రంలో పరిస్థితులు, ప్రస్తుత పరిస్థితులు కలిపి చర్చించారు. ఈ సమయంలో జగన్ మరికొన్ని సూచనలు చేశారట. రైతులకు మరింత లబ్ధి కలిగేలా సీఎం సూచనలు చేశారట. ఈ మాటలు వింటుంటే.. రైతుల కోసం ప్యాకేజీ సిద్ధమవుతున్నట్టే కనిపిస్తోంది.

 

మంత్రి బొత్స ఇంకా ఏమన్నారంటే.. “ సమగ్ర ప్రణాళికతో ప్రజల మనోభావాలకు అనుగుణంగా ముందుకెళ్తాం. కమిటీ నివేదికను కేబినెట్‌ ముందు ఉంచుతాం. కేబినెట్‌ భేటీలో సీఎంకు అన్ని విషయాలు చెబుతాం. రైతుల సమస్య సీఎం వైయస్‌ జగన్‌ దృష్టికి తీసుకెళ్లాం. మూడు రోజుల అసెంబ్లీ సమావేశాల్లో అన్ని అంశాలపై చర్చిస్తాం. అన్ని వర్గాలు బాగుపడాలన్నదే మా తాపత్రయం. అమరావతిలో నిర్మాణాల్లో ఉన్న భవనాలన్నీ పూర్తి చేస్తాం. అమరావతిలో నిర్మించిన అన్ని భవనాలు ఉపయోగించుకుంటాం. అమరావతి రైతులు చంద్రబాబు మాయలో పడొద్దు. వ్యక్తిగత స్వార్థంతో చంద్రబాబు మోసం చేస్తున్నారు. మేము రాష్ట్ర సమగ్రాభివృద్ధి గురించి ఆలోచిస్తున్నాం.. అన్నారు మంత్రి బొత్స.

మరింత సమాచారం తెలుసుకోండి: