ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు, సమీకరణాలు ఎప్పటికపు వడివడిగా మారిపోతున్నారు. ప్రతిపక్ష, విపక్షాల మధ్య ఎత్తుకు పైఎత్తులు వేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. అధికార పక్షాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్ష నేత పడరాని పట్లు పడుతున్నారు. ఈ క్రమంలో ఆయన ఇంటి కోడలితో సహా కుటుంబం మొత్తని రోడ్డెక్కించారు. ఆందోళన చేపట్టిన రాజధాని రైతులకు బాసటగా నారా వారి కుటుంబ సభ్యులు రోడ్డు మెడకు తీసుకొచ్చారు. ఈ పరిణామాల నేపథ్యంలో తన ఆలోచన విధానానికి అనుగునంగా శరవేగంగా అడుగులేస్తున్నారు. అందుకు అనుగుంగానే సంచలనమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో జనవరి 18 వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర క్యాబినెట్ సమావేశం జనున్నది.

వాస్తవానికి ఈ సమావేశం ఈ నెల 20 న జరగాల్సి ఉంది. ఈ సమావేశాన్ని ప్రభుత్వం 18 కి మార్చివేసింది. దీనితో ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గ సమావేశం తేదీలో మార్పు జరిగింది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు ఈ భేటీ నిర్వహించనున్నట్లు ప్రభుత్వవర్గాలు వెల్లడించాయి. తొలుత ఈనెల 20న మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని భావించినప్పటికీ తాజాగా రేపటికే మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. పరిపాలన వికేంద్రీకరణ, ఏపీ సమగ్రాభివృద్ధిపై జీఎన్‌ రావు, బోస్టన్‌ గ్రూప్‌లు ఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. ఆ నివేదికలపై పలువురు మంత్రులు, ఐఏఎస్‌ అధికారులతో రాష్ట్ర ప్రభుత్వం హైపవర్‌ కమిటీని ఏర్పాటు చేసింది.


ఆ కమిటీ ఇప్పటికే పలు దఫాలుగా సమావేశమై వివిధ అంశాలపై చర్చించింది. కేబినెట్‌ భేటీకి ముందే ఆ కమిటీ తమ నివేదికను సీఎం జగన్‌కు అందించే అవకాశముంది. కేబినెట్‌ భేటీలో పలు అంశాలతో పాటు హైపవర్‌ కమిటీ నివేదికపైనా చర్చించనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రానికి మూడు రాజధానులు రావొచ్చంటూ గతంలో సీఎం జగన్‌ వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఆ అంశంపై కేబినెట్‌ నిర్ణయం తీసుకునే అవకాశముంది. మరోవైపు ఈనెల 20 నుంచి మూడు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. హైపవర్‌ కమిటీ నివేదిక, రాజధానుల అంశంపై అసెంబ్లీలో ప్రభుత్వం ప్రకటన చేసే అవకాశముంది. ఈ నేపథ్యంలో రాజధానులపై ఎలాంటి ప్రకటన చేయనుందనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది 

మరింత సమాచారం తెలుసుకోండి: