అందరూ అనుకున్నట్టే చిట్టచివరికి పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీతో పొట్టు పెట్టేసుకున్నాడు. 2014లో అతను పార్టీని స్థాపించినప్పుడు పార్టీకి మద్దతు ఇస్తూ వచ్చాడో చివరికి అదే పార్టీతో కలిసి రాబోయే పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించాడు. గురువారం విజయవాడలోని ఒక హోటల్ లో జనసేన పార్టీ నాయకులు మరియు భారతీయ జనతా పార్టీ నాయకులు సమావేశమై అఫీషియల్ గా తమ పొత్తు గురించి మీడియా వారి ముందు చెప్పారు.

 

అయితే మన మీడియా బాబులూ ఊరికే ఉండరు కదా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు సూటిగా ఒక ప్రశ్న వేశారు. గతంలో ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ కు లేదని భారతీయ జనతా పార్టీ పై ధ్వజమెత్తిన పవన్కళ్యాణ్ చివరికి వారితోనే చేతులు కలపడం గురించి సమాధానం ఇవ్వమని అతన్ని ప్రశ్నించగా పవన్ కూడా అందుకు తగ్గట్టు ఘాటుగానే స్పందించారు. 2014 నుండి 2019 వరకు 5 ఏళ్లు అధికారంలో ఉన్నది తెలుగుదేశం పార్టీ అని వారిని అడగకుండా తనను ప్రత్యేక హోదా పైన ప్రశ్నించడం ఏమిటని పవన్ తిరిగి వారిని ప్రశ్నించారు.

 

అంతేకాకుండా ప్రస్తుతం అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 22 మంది ఎంపీలు ఉండగా తెలుగుదేశం పార్టీకి ముగ్గురు ఎంపీలు ఉన్నారు. వారిద్దరూ చేతిలో అంత పవర్ పెట్టుకొని ప్రత్యేక హోదా విషయాన్ని సీరియస్ గా తీసుకోకపోతే వారిని వదిలేసి కేవలం బీజేపీతో చేతులు కలిపినందువల్ల తనను ప్రశ్న అడగడం ఏమాత్రం తగ్గదని పవన్ వారికి బదులు ఇచ్చారు. అంతే కాకుండా రాష్ట్రం లో ఇప్పుడు సమతుల్యత లోపించి ఉందని.. రాబోయే రోజుల్లో వీరిద్దరి పొత్తు మళ్లీ రాష్ట్రానికి మంచి రోజులలోకి నడిపిస్తుందని పవన్ ఆశాభావం వ్యక్తం చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: