తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం చేసింది గుండు సున్నా అని మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చట్టప్రకారం దక్కాల్సిన నిధులు మాత్రమే తెలంగాణ రాష్ట్రానికి దక్కాయని అదనంగా కేంద్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని కేటీఆర్ అన్నారు. బీజేపీ పార్టీ గడచిన ఐదున్నర సంవత్సరాలలో రాష్ట్రంలోని పట్టణాలకు ఇచ్చిన ప్రత్యేక నిధుల వివరాలను ముందుపెట్టాలని కేటీఆర్ సవాల్ విసిరారు.
 
కాంగ్రెస్ బీజేపీ పార్టీలు వందల స్థానాలలో తమ అభ్యర్థులను నిలపలేకపోయాయని టీఆర్ఎస్ రెబల్స్ తరపున ప్రచారం చేసే దుస్థితికి కాంగ్రెస్, బీజేపీ పార్టీలు చేరాయని కేటీఆర్ అన్నారు. ఈ పార్టీలు ప్రజల ముందు నాటకాలు ఆడుతున్నాయని అనైతికంగా లోపాయికారీ ఒప్పందాలు చేసుకుంటున్నాయని కేటీఆర్ విమర్శలు చేశారు. టీఆర్ఎస్ పార్టీ మాత్రమే రాష్ట్రంలోని అన్ని డివిజన్లలో పోటీ చేస్తోందని కేటీఆర్ అన్నారు. 
 
కేసీఆర్ పై ప్రజలకు అపారమైన నమ్మకం ఉందని విపక్షాలు ఎంత గింజుకున్నా ప్రయోజనం లేదని కేటీఆర్ చెప్పారు. కేసీఆర్ పై ప్రజలకు ఉన్న అపారమైన నమ్మకమే తీర్పుగా వస్తుందని కేటీఆర్ అన్నారు. టీఆర్ఎస్ పాలనలో పట్టణాలు ప్రగతి పథకంలో పరుగులు తీశాయని చెప్పారు. బీజేపీ పార్టీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి చేసిన టీఆర్ఎస్ పార్టీపై ఛార్జిషీటు అని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. 
 
దశాబ్దాలుగా దగా చేస్తున్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై ప్రజలు ఛార్జిషీట్ దాఖలు చేస్తారని కేటీఆర్ అన్నారు. చేసిన అభివృద్ధి ఆధారంగానే ఓట్లు అడుగుతున్నామని ప్రజలు గెలిపిస్తారనే పూర్తి విశ్వాసం ఉందని కేటీఆర్ అన్నారు. టికెట్ల కేటాయింపుపై వస్తున్న విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు గెలుపు కోసమే ఐక్యంగా పని చేస్తున్నాయని కేటీఆర్ అన్నారు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలే ఓటర్లను ప్రభావితం చేస్తాయని కేటీఆర్ అన్నారు. మా మంత్రి టికెట్లు అమ్ముకున్నారని విమర్శలు చేశారని ఆ విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని కేటీఆర్ అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: