అమరావతి కోసం నిర్మాణాలను నిర్మిస్తున్నారు.  ఇప్పటికే చాల వరకు పూర్తయ్యాయి.  అయితే, ప్రభుత్వం నుంచి ఒక్కరూపాయి ఖర్చు చేయకుండానే నిర్మాణాలు నిర్మించే విధంగా గతంలోనే ప్లానులు జరిగాయి.  దీనికి అనుగుణంగానే రూపకల్పన చేస్తున్నారు.  అయితే, నిర్మాణాలను నిలిపివేసి అమరావతిని మార్చాలని చూస్తున్నారు.  కానీ, అలా మార్చిడం సాధ్యం కాకపోవచ్చు.  ఎందుకంటే నిర్మాణాలు పెద్ద ఎత్తున ఇప్పటికే అక్కడ పూర్తయ్యాయి.  


ఇక నగర నిర్మాణం కోసం ప్రభుత్వాన్ని ఎనిమిదేళ్ళకు గాను కోరింది కేవలం 12,600 కోట్లు మాత్రమే.  అది కూడా సపోర్టింగ్ గ్రాంట్ రూపంలో కోరింది.  మొదటి ఏడాది రూ. 500 కోట్లు, మిగతా సంవత్సరాలు 1800 కోట్లు చివరి ఏడాది 1300 కోట్లు కోరింది.  ఇలా మొత్తం 12,600 కోట్లు ప్రభుత్వం నుంచి ఇస్తే నగర నిర్మాణానికి కావలసిన అన్ని సౌకర్యాలు సీఆర్డిఏ చూసుకుంటుంది.  


ఇలా ఇచ్చిన డబ్బును 2037 తరువాత సిఆర్డి ఏ తిరిగి చెల్లిస్తుంది.  అంటే ఇప్పుడు పెట్టిన పెట్టుబడి ప్రభుత్వానికి తిరిగి చెల్లించేలా ప్లాన్ చేశారు.  పైగా ఆదాయం వచ్చే మార్గాలను సీఆర్డిఏ రూపకల్పన చేసింది.  కానీ, ఇప్పుడు ఏం జరిగింది.  మొత్తం రివర్స్ అయ్యింది.  సిఆర్డిఏ అధికారాలకు అసలు సిఆర్డిఏ ను రద్దు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.  సీఆర్డిఏ విషయంలో ప్రభుత్వం కొంత వ్యతిరేకమైన వైఖరిని ప్రదర్శిస్తోంది.  


అమరావతి విషయంలో ఈరోజు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతున్నది. విశాఖకు కార్యనిర్వాహక రాజధానిని మార్చేందుకు ప్రయత్నం మొదలుపెట్టింది.  ఈనెల 20 వ తేదీన దీనికి సంబంధించిన తుది నిర్ణయం ఉండొచ్చు.  ఈనెల 20 తరువాత కార్యనిర్వాహక రాజధానిని మార్చేందుకు అన్ని రెడీ చేస్తున్నారు.  ఈనెల 26న రిపబ్లిక్ డే వేడుకలను కూడా అక్కడే నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు.  ఈనెల 20 న అమరావతిలో పెద్ద యుద్ధమే జరిగాలేనా కనిపిస్తోంది . 

మరింత సమాచారం తెలుసుకోండి: