మహారాష్ట్రలో ఉద్దవ్ ఠాక్రే తీసుకున్న ఓ నిర్ణయం మరో వివాదానికి దారి తీస్తోంది. అసలు సాయిబాబా జన్మస్థలం ఏదీ అన్న వివాదం ఇప్పుడు మొదలైంది. సాయిబాబా దేవాలయంగా షిరిడీ ప్రపంచ వ్యాప్తగా గుర్తింపు పొందింది. దేశం నలుమూలల నుంచి భక్తులు ఇక్కడి వస్తారు.

 

అయితే.. సాయిబాబు షిరిడీకి 275 కిలోమీటర్ల దూరంలో పర్భణీ జిల్లాలోని పత్రి అనే ఊరు సాయిబాబా జన్మస్థలమని ప్రచారం ఎప్పటినుంచో ఉంది. 1854లో 16 ఏళ్ల వయసులో సాయి షిరిడీకి వచ్చారని అంటారు. ఇక్కడే తొలుత ఓ వేపచెట్టు కింద సాయిబాబా కనిపించారని చెబుతారు. ఇటీవల సీఎంగా ఉద్దవ్ ఠాక్రే వచ్చాక.. ఈ గ్రామాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. మరో షిరిడీగా మారుస్తామన్నారు. అంతే కాదు. ఏకంగా రూ. 100 కోట్ల నిధులు కేటాయించారు.

 

దీంతో షిరిడీ వాసులు సీఎం నిర్ణయంపై మండిపడుతున్నారు. జనవరి 19వ తేదీ ఆదివారం నుంచి షిరిడీలోని సాయిబాబా ఆలయాన్ని నిరవధికంగా మూసి వేయనున్నట్లు సాయిబాబా సంస్థాన్‌ ట్రస్ట్‌ ప్రకటించింది. ఈ మేరకు ట్రస్ట్‌ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. సీఎం నిర్ణయంపై చర్చించేందుకు శనివారం సాయంత్రం షిరిడీ గ్రామస్థులంతా సమావేశం కానున్నారు. సాయి బాబా జన్మస్థలం పత్రి అంటూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే ప్రకటించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

 

సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే పత్రిని అభివృద్ధి చేస్తే షిర్డీ ప్రాముఖ్యం తగ్గిపోతుందన్నది షిర్టీలోని సాయిబాబా సంస్థాన్‌ ట్రస్ట్‌ ఆందోళన. షిర్డీని కాదని పర్భణీకి సాయి మందిరాన్ని తరలించాలన్నది రాష్ట్ర సర్కార్‌ యత్నమని ట్రస్ట్‌ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ నిర్ణయాన్ని ఎలాగైనా అడ్డుకుంటామంటున్నారు. అందులో భాగంగానే ఆదివారంనాడు బంద్‌కు పిలుపిచ్చింది. సీఎం నిర్ణయానికి వ్యతిరేకంగా ఆలయం మూసివేత నిర్ణయం తీసుకుంది. ఆ రోజునుంచే సాయి ఆలయంలో అన్ని కార్యక్రమాలూ నిలిపేస్తున్నట్లు ప్రకటించడం సాయి భక్తులకు అశనిపాతంగా మారింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: