మున్సిపల్ ఎన్నికల పోరు జోరందుకున్న విషయం తెలిసిందే. ఈ నెల 22న జరగనున్న మున్సిపల్ ఎన్నికలకు అటు అధికారులు సర్వం సిద్ధం చేస్తున్నారు. పార్టీల గురించి అయితే కొత్తగా చెప్పాల్సిన పని లేదు. తమదే విజయమని అంటూ పూర్తి ధీమా తో ఉన్నారు అన్ని పార్టీల నేతలు. గెలుపు గుర్రాలను బరిలోకి దింపి... విజయం వైపుగా దూసుకుపోతున్నారు. ఇక అన్ని పార్టీలు ఇప్పటికే ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఇక మున్సిపల్ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న అన్ని పార్టీలు... ప్రణాళికలు వ్యూహాలు రచిస్తున్నాయి. మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాకముందు నుంచి అన్ని పార్టీలు మున్సిపల్ ఎన్నికల్లో విజయం కోసం పావులు కదుపుతూ వస్తున్నాయి. ఇక ఇప్పుడు ప్రచార రంగంలో మరింత జోరు పెంచాయి. 

 

 

 ఇకపోతే జనగామ లో కూడా అన్ని పార్టీలు మున్సిపల్ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని ముందుకు సాగుతున్నాయి. అయితే జనగామ మున్సిపల్ ఎన్నికల్లో ఓ ఆసక్తికర  అంశం తెరమీదకి వచ్చింది. జనగామ  మున్సిపల్ ఎన్నికల్లో ఏకంగా పది మంది పోస్టు గ్రాడ్యుయేట్లు బరిలోకి దిగారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఏదో ఒక ఉద్యోగం చేసుకొని తమ బతుకు తాము బతకడం కంటే... కొంతయినా ప్రజలకు సేవ చేసి నలుగురిలో మనసుల్లో నిలవాలి అనుకున్న  పోస్టు గ్రాడ్యుయేట్లు మున్సిపల్ ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి బరిలోకి దిగారు. కాగా  ఓకే జిల్లాలో పది మంది పోస్ట్ గ్రాడ్యుయేట్లు బరిలోకి దిగడంతో ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో  ఆసక్తికరంగా మారింది.. 

 

 

మునిసిపల్‌ ఎన్నికల్లో బరిలోకి దిగిన పదిమందికి గ్రాడ్యుయేట్ లలో అనిత్‌ (ఎంటెక్‌), వేమల్ల మనీష(ఎమ్మెస్సీ), ఆకుల రజని(ఎంఏ), కానుగంటి సువర్ణ(ఎంటెక్‌), జక్కుల అనిత(ఎమ్మెస్సీ), కాసుల అనిత(ఎంఏ), కర్రె రాజశేఖర్‌రెడ్డి (ఎంకామ్‌), నిడిగొండ శివకృష్ణ(ఎంబీఏ), కొత్తపల్లి సమ్మయ్య(ఎంకామ్‌), మల్లేశ్‌(ఎంఏ) ఉన్నారు.వీరందరూ పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసే ఎన్నికల వైపు మొగ్గు చూపడంతో ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ప్రజలు కూడా మంచి విద్యావంతుడు మాకు నాయకుడైతే ప్రజల కష్టాలను అర్థం చేసుకోగలడు అని నమ్ముతున్నారు. ఇక వీరు ప్రచార రంగంలో తనదైన శైలిలో దూసుకుపోతున్నారు కూడా. ఏదేమైనా పోస్టు గ్రాడ్యుయేట్లు రాజకీయాల్లోకి వెళ్లారు అంటే..  రాజకీయాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి అని ప్రజలు నమ్ముతున్నారు. అయితే మున్సిపల్ ఎన్నికల బరిలో దిగిన ఈ 10 మంది గ్రాడ్యుయేట్లు ప్రజలను ఎంతలా  ఆకర్షించి విజయం సాధిస్తారో లేదో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: