కేంద్ర ప్రభుత్వం సిఏఏ ను అమలులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.  పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన మైనారిటీలకు ఇండియా పౌరసత్వం కల్పించేందుకు ఈ చట్టం తీసుకొచ్చింది.  దీని వలన భారతీయ ముస్లింలకు ఎలాంటి ఇబ్బందులు కలవబోవని, దానికి దీనికి సంబంధం లేదని ప్రభుత్వం చెప్తున్నది.  ఆ మూడు దేశాల్లో ముస్లింలు మెజారిటీ వర్గీయులని, వారికి ఇండియాలో పౌరసత్వం కల్పించే విషయం ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పిన సంగతి తెలిసిందే. 


కేవలం మతపరమైన పీడనకు గురైన హిందూ, సిక్కు, ఇతర మైనారిటీలకు మాత్రమే ఈ బిల్లు ఉపయోగపడుతుంది.  దీనిని అమలు ఇటీవలే అమలులోకి తీసుకొచ్చారు.  అయితే, ఈ బిల్లును తాము తమ రాష్ట్రాల్లో అమలు చేయబోమని కొన్ని రాష్ట్రాలు భీష్మించుకుని కూర్చుంటున్నాయి.  మైనారిటీ హక్కులకు భంగం కలుగుతుందని వాపోతున్నాయి.  అసలు ఈ బిల్లుకు వాటికి సంబంధం లేదని చెప్తున్నా వినడం లేదు.

 
అక్కడితో ఆగకుండా ఈ సిఏఏ కు వ్యతిరేకంగా దేశంలో అన్ని ప్రాంతాల్లో నిరసనలు ధర్నాలు చేస్తున్నారు.  కొంతమంది వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతుంటే, కొందరు మాత్రం అనుకూలంగా నినాదాలు చేస్తూ ర్యాలీలు చేస్తున్నారు.  దీంతో ఇప్పుడు దేశం రెండుగా విడిపోయింది.  సిఏఏ తో పాటుగా అటు ఎన్పీఆర్ కు కూడా మద్దతు ఇవ్వడం లేదు.  అయితే, మద్దతు ఇస్తున్న వ్యక్తులు కొందరు వినూత్నంగా అలోచించి ప్రచారం చేస్తున్నారు.  ఇందులో భాగంగానే ఓ వ్యక్తి ఇటీవలే ఓ ప్రచారం నిర్వహించారు.  


అదేమంటే, తన పెళ్లి కార్డులో ఐ సపోర్ట్ సిఏఏ అని పెద్ద అక్షరాలతో ముద్రించి వాటిని బందువులకు, స్నేహితులకు మీడియా ఛానళ్ల వారికి పంపించారు.  ఇది ఇప్పుడు వైరల్ అయ్యింది.  సిఏఏ కు సపోర్ట్ చేసే వారి సంఖ్య దేశంలో క్రమంగా పెరుగుతుండటం విశేషం. ఈ సంఘటన మధ్యప్రదేశ్ లోని నరసింహపూర్ జిల్లాలో జరిగింది.  ప్రభాత్ అనే వ్యక్తి తన పెళ్లి కార్డుపై ఇలా ముద్రించుకున్నాడు.  దేశంలోని ప్రతి ఒక్కరు కూడా సిఏఏ కు సపోర్ట్ చేయాలని అంటున్నాడు.  

మరింత సమాచారం తెలుసుకోండి: