ప్రస్తుత రాష్ట్ర రాజధాని అమరావతిలో జరుగుతున్నా పరిణామాలను పరిస్తుంటే అది నిజంగానే భమారావతిని తలపిస్తుంది. సర్కార్ కూడా అందుకు అనుగుంగానే వ్యవహరిస్తున్నట్టుగా కన్పిస్తుంది. ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గ సమావేశం తేదీలో మార్పు జరిగింది. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు ఈ భేటీ నిర్వహించనున్నట్లు ప్రభుత్వవర్గాలు వెల్లడించాయి. తేరా చూస్తే అది కాస్తా వాయిదా పడింది. దీనితో ఇది నిజంగానే భమారావతి అని ఎవరికైనా తలపించక మానదు కదా. ఇక విషయానికి వస్తే..  రాష్ట్ర కేబినెట్‌ సమావేశం వాయిదా పడింది. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో సీఎం జగన్‌ అధ్యక్షత మంత్రివర్గ భేటీ జరగాల్సింది.

తాజాగా 20వ తేదీ(సోమవారం)కి వాయిదా వేసినట్లు తెలుస్తోంది. తొలుత ఈనెల 20న మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని ప్రభుత్వ భావించినప్పటికీ.. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. తాజాగా ఈ రోజు జరగాల్సిన భేటీ కూడా వాయిదా పడింది. ఈనెల 20 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. 

అసెంబ్లీ సమావేశాలు ప్రారంభానికి ముందే కేబినెట్‌ భేటీ నిర్వహించి పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపే అవకాశముంది. కేబినెట్‌ భేటీకి ముందే హైపవర్‌ కమిటీ కూడా తమ నివేదికను సీఎం జగన్‌కు అందజేసే అవకాశముంది.ఆ నివేదికపైనా కేబినెట్‌లో చర్చించనున్నారు. మూడు రాజధానుల అంశంపై రాష్ట్రంలో చర్చ జరగుతున్న నేపథ్యంలో కేబినెట్‌లో నిర్ణయం తీసుకుని అసెంబ్లీ సమావేశాల్లో దానిపై స్పష్టత ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉండగా రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్​ను శనివారం  రాజధాని అమరావతి గ్రామాలకు చెందిన 20మంది మహిళా రైతులు కలవనున్నారు. రాజధానిగా అమరావతిని కొనసాగించాలని కోరుతూ జరుగుతున్న ఆందోళనలను వారు గవర్నర్​కు వివరించనున్నారు. ముడుపులు చెల్లించేందుకు విజయవాడలోని కనకదుర్గమ్మ చెంతకు పాదయాత్రగా వెళుతుంటే పోలీసులు జరిపిన హింసకాండను ఆయన దృష్టికి తీసుకువెళ్లనున్నట్లు మహిళా రైతులు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: