భారతదేశంలో క్రికెట్ కి ఒక రేంజ్ లో క్రేజ్ ఉంటుందన్న విషయం తెలిసిందే. అయితే టీవీల ముందు కూర్చొని కన్నార్పకుండా క్రికెట్ ను  చూడడమే కాదు చిన్న పెద్దా అంతా కలిసి మైదానంలోకి చేరి క్రికెట్ ఆడడానికి కూడా ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఇక చిన్నపిల్లలైతే ఇప్పుడు ఎక్కువగా క్రికెట్ ఆడడానికి మొగ్గు చూపుతున్నారు. ఇక్కడ కొంతమంది పిల్లలు క్రికెట్ ఆడాలని అనుకున్నారు. ఇక అందరూ స్నేహితులు ఒకదగ్గర చేరి మైదానంలో క్రికెట్ ఆడడానికి వెళ్లారు. ఇక అంతా ఆనందంగా క్రికెట్ ఆడుతున్న సమయంలో... పెను విషాదం చోటు చేసుకుంది. సరదాగా స్నేహితులతో క్రికెట్ ఆడడానికి వెళ్లిన ఓ  బాలుడికి క్రికెట్ బంతి తగిలి ప్రాణాలు కోల్పోయాడు. దీంతో ఆ బాలుడి కుటుంబానికి తీరని శోకం మిగిలింది. 

 

 

 వివరాల్లోకి వెళితే... కర్నూలు జిల్లా ఆదోనిలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. స్థానిక కార్వన్ పేటకు చెందిన 12 ఏళ్ల మైసుద్ధిన్ ఆరో తరగతి చదువుతున్నాడు. కాగా నిన్న స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడేందుకు మసీదుపురం మైదానానికి వెళ్ళాడు. స్నేహితులంతా సరదాగా క్రికెట్ ఆడారు. ఇక ఆట ముగిసిన తర్వాత మైదానంలో కూర్చుని సేద తీరుతాడు మైసూద్ధిన్. ఈ క్రమంలోనే పక్కనే క్రికెట్ ఆడుతున్నారు ఇంకొంతమంది. అయితే మరో బాలుడు  కొట్టిన బంతి వేగంగా వచ్చి మైసూద్ధిన్  ఛాతి భాగంలో బలంగా తాకింది. 

 

 

 దీంతో క్రికెట్ బాల్ తగలగానే ఆ బాలుడు అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఇక మైసూద్ధిన్  అక్కడికక్కడే కుప్పకూలిపోవటంతో  పక్కనే ఉన్న మిగతా వాళ్లు హడలిపోయారు. అయితే ఈ ఘటన జరుగుతుండగా గమనించిన స్థానికులు హుటాహుటిన అక్కడికి చేరుకొని మైసూద్దీన్  కి నీళ్ళు తాగించి సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఇక మైసూద్దీన్ ను  పరీక్షించిన వైద్యులు ఆ బాలుడు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధరించారు. అల్లారుముద్దుగా పెంచుకున్న తమ కుమారుడు ఇక తమకు లేడు అన్న విషయాన్ని జీర్ణించుకోలేక మైసూద్దీన్  తల్లిదండ్రులు కాజా,  షాహిద బేగం కన్నీరుమున్నీరుగా విలపించారు. మైసూద్దీన్  తల్లిదండ్రులు విలపిస్తున్న తీరు అక్కడున్న వారందరినీ కంటతడి పెట్టించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: