రాజధాని అమరావతి పై ఇపుడు జరుగుతున్న వివాదాలన్నింటికీ అసలు సమస్య ఏంటో తెలుసా ? బిజెపిలో చేరిన సీనియర్ నేత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి  లెక్క ప్రకారం  వివాదమంతా కేవలం రెండు కులాల మధ్య మొదలైన గొడవ.  ఇద్దరు వ్యక్తుల మధ్య మొదలైన ఆధిపత్య వివాదం.  అందువల్లే రాష్ట్ర రాజధాని అన్న అంశం ఇంత కంపుగా తయారైందని బైరెడ్డి చెప్పారు.

 

నిజానికి రాష్ట్ర రాజధాని అన్నది  మొత్తం ప్రజలకందరికీ చెందినది అన్న విషయాన్ని ఇటు జగన్మోహన్ రెడ్డి అటు చంద్రబాబునాయుడు ఇద్దరూ మరచిపోయారట. శ్రీభాగ్ ఒప్పందాన్ని ఆధారంగా  రాష్ట్ర విభజన తర్వాత కర్నూలునే చంద్రబాబు రాజధానిగా పెడతారని రాయలసీమ వాసులు అందరూ భావించారట. కానీ చంద్రబాబు గుంటూరు జిల్లాలోని అమరావతిని రాజధానిగా ప్రకటించటంతో చేసేది లేక అందరూ ఆమోదించారట.

 

రాజధాని అమరావతిని చేసినపుడు హై కోర్టయినా కర్నూలుకు ఇవ్వాలని తాము చేసిన డిమాండ్ ను చంద్రబాబు అప్పట్లో ఆమోదించలేదని గుర్తుచేశారు. అయినా చేసేది లేక తాము మౌనం వహించినట్లు చెప్పారు. అలాంటిది ఇపుడు జగన్ సిఎం అవ్వగానే రాజధానిని మళ్ళీ అమరావతి నుండి తరలిస్తామని అంటే కుదరదని హెచ్చరించారు. రాజధానిగా అమరావతినే కంటిన్యు చేయాలని ఒకవేళ మార్చాల్సొస్తే కచ్చితంగా కర్నూలులోనే ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

 

రాజధానిని కర్నూలుకు కాకుండా ఇంకో ప్రాంతంలో ఏర్పాటు చేస్తానంటే అంగీకరించేది లేదని జగన్ ను హెచ్చరిచాంరు. ఈ గొడవంతా కేవలం రెండు కులాల మధ్య, ఇద్దరు వ్యక్తుల మధ్య మొదలైన ఆధిపత్య గొడవలుగానే  బైరెడ్డి తేల్చేశారు.  ఒక కులం మీద మరో కులం ఆధిపత్యం సాధించటం కోసం చంద్రబాబుపై ఆధిపత్యం సాధించటం కోసం జగన్ ప్రయత్నిస్తుండటంతోనే రాష్ట్రాభివృద్ధి దెబ్బతింటోందని ఆయన తెగ బాధపడిపోయారు.  అంటే రాజధాని తరలింపుకు జగన్ చెబుతున్నది, రాజధానిని అమరావతిలోనే ఉంచాలన్న చంద్రబాబు డిమాండ్ కు అసలు కారణాలను చెప్పి బైరెడ్డి జనాల కళ్ళు తెరిపించారుగా.

మరింత సమాచారం తెలుసుకోండి: