అన్ని దానాల్లోకెల్లా రక్త దానం చాల గొప్పది అంటారు... ప్రాణం పోతున్నా మనుషులకు గుప్పెడు రక్తం ఇచ్చి ప్రాణం కాపాడితే... ఆ తృప్తి  వేరే ఉంటుంది. అందుకే రక్తదానం చేయడానికి చాలామంది ముందుకు వస్తున్నారు. రక్తదానం చేసి మనిషికి పునర్జన్మ ప్రసాదించడం పరిపాటి. అయితే రక్తదానం చేయడం వల్ల ఎదుటి వ్యక్తి ప్రాణాలను కాపాడడం తో పాటు మన ఆరోగ్యానికి కూడా మేలు జరుగుతుంది అన్న విషయం తెలిసిందే. మనం రక్తదానం చేయడం వల్ల ఎదుటి వ్యక్తి ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడతారు. అంతే కాకుండా మనకు కొత్త రక్తం రావడానికి వీలు ఉంటుంది. అయితే ఇప్పటివరకు ఒక మనిషి ఇంకొక మనిషికి రక్తదానం చేయడం చాలా మంది చూసే ఉంటారు. రక్తదానం చేసి ప్రాణాలు కాపాడుతూ ఉంటారు. కానీ ఒక శునకం ఇంకో శునకం  కోసం రక్తదానం చేయడం ఎక్కడైనా విన్నారా చూసారా.. 

 

 కానీ ఇక్కడ ఒక శునకం  మాత్రం అనారోగ్యంతో బాధపడుతున్న మరో శునకం  ప్రాణం నిలబెట్టేందుకు రక్త దానం చేసింది. ప్రస్తుతం ఈ ఘటన నేటి సమాజానికి ఆదర్శంగా నిలుస్తోంది. కర్ణాటకలో ఈ ఘటన జరిగింది. కర్ణాటకలోని సుందర పట్టణానికి చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి మనీష్  కులకర్ణి ... రెండేళ్లుగా రాట్ వైలర్  జాతి కుక్కను రాన అనే పేరుతో పెంచుకుంటున్నాడు. ఇక దార్వాడ్ కు   చెందిన గణేష్ కూడా ఇదే జాతి కుక్కని  రోటి అనే పేరుతో ఎంతో ప్రేమగా పెంచుకుంటున్నాడు . అయితే గణేష్ అనే వ్యక్తి ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న రోటి అనే శునకం కామెర్ల బారిన పడి అనారోగ్యం పాలైంది. 

 

 

 అయితే కామెర్లు వ్యాధి ముదిరి పోవడంతో రోటి అనే శునకం ప్రాణాపాయ స్థితిలో పడిపోయింది. అయితే ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆ శునకాన్ని  కాపాడాలంటే రక్తం అవసరమని వైద్యులు చెప్పారు. దీంతో మనిష్ కులకర్ణి ని  గణేష్ సంప్రదించి విషయాన్ని వివరించాడు. దీంతో మనిష్  కులకర్ణి అంగీకరించడంతో అతని శునకం రానా రక్త దానం చేసింది. ఇక ఆ శునకం నుంచి రక్తాన్ని సేకరించిన వైద్యులు.. ఆ రక్తాన్ని రోటి అనే  శునకానికి ఎక్కించారు. కాగా  ఈ విషయం సోషల్ మీడియా ఎక్కడంతో రక్తదానం చేసిన శునకంను  నెటిజన్ల అభినందిస్తున్నారు. కాగా ప్రస్తుతం ఈ రెండు కుక్కలు ఆరోగ్యం గానే ఉన్నాయి.అంతేకాకుండా ఒక శునకం అనారోగ్యంతో ఉండటంతో మరో శునకం రక్తదానం చేయడం ప్రస్తుతం అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: