చంద్రబాబునాయుడును దెబ్బ కొట్టటానికి జగన్మోహన్ రెడ్డి భలే  టైంను చూసుకున్నారు. మూడు రాజధానుల వివాదం ఒకవైపు ఇదే విషయమై మూడు రోజుల  ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల నిర్వహించబోయే ముందు సరిగ్గా జగన్ ప్రభుత్వం ఇన్ సైడర్ ట్రేడింగ్ కు సంబంధించిన వివరాలను బయటపెట్టింది.  చంద్రబాబు అండ్ కో ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడి వేలాది ఎకరాలను దోచేసుకున్నారంటూ వైసిపి ఎప్పటి నుండో ఆరోపణలు చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే.

 

ప్రతిపక్షంలో ఉన్నపుడు చేసిన ఆరోపణలకు ఇపుడు ఆధారాలతో సహా  బయటపెట్టింది. ఓత్ ఆఫ్ సీక్రెసిని చంద్రబాబు అండ్ కో ఉల్లంఘించి వేలాది ఎకరాలను దోచేసుకున్నట్లు సిఐడి ఆధారాలను సేకరించిందట. సేకరించిన ఆధారాలతో మొత్తం కేసును ఆదాయపు పన్ను శాఖ తో దర్యాప్తు చేయించాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు జగన్ మీడియా చెప్పింది.

 

ఏ ఏ సెక్షన్ల క్రింద చంద్రబాబు అండ్ కో పై కేసులు పెట్టవచ్చు, ఆ సెక్షన్ల ద్వారా వీళ్ళ అవినీతిని నిరూపించవచ్చా అనే అంశాలపై ప్రభుత్వం ముందుగానే బాగా లోతుగా అన్నీ కోణాల్లోను ఆలోచించినట్లు సమాచారం. ఈ విషయంలో న్యాయపరమైన సలహాలు కూడా తీసుకున్న తర్వాతనే  ఇన్ సైడర్ ట్రేడింగ్  దోపిడిని బయటపెట్టినట్లే అనిపిస్తోంది.

 

అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం చంద్రబాబు అండ్ కో భారీ ఎత్తున ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడిన విషయం అర్ధమైపోతోంది. రాజధానిగా అమరావతిని మారుస్తామని జగన్ ప్రతిపాదించగానే చంద్రబాబు ఎందుకింతగా గోల చేస్తున్నారు. తన సామాజికవర్గంలోని ప్రముఖులను, టిడిపి కీలక నేతలను, సినీ ప్రముఖులతో పాటు ఎన్టీయార్ కుటుంబసభ్యులను కూడా తాను చేస్తున్న రచ్చలో భాగస్వాములను చేస్తున్నారు.

 

ఇదంతా ఎందుకు చేస్తున్నారంటే ఇన్ సైడర్ ట్రేడింగ్ లో దోచేసిన భూములను కాపాడుకునేందుకు, వాటి విలువ పడిపోకుండా ఉండేందుకే అనే ఆరోపణలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి.  తాజాగా జగన్ మీడియా బయటపెట్టిన ఆధారాలతో  అమరావతి రచ్చ మరింత పెరిగిపోయేట్లే ఉంది. చూస్తుంటే చంద్రబాబును జగన్ గురిచూసి ఓ పద్దతి ప్రకారం కొడుతున్నట్లే అనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: