ఇన్ సైడర్ ట్రేడింగ్ లో చంద్రబాబునాయుడు అండ్ కో చేసిన దోపిడిని సిఐడి ఆధారాలతో సహా బయటపెట్టింది అని జగన్మోహన్ రెడ్డి మీడియా బయటపెట్టింది. సాక్షి దినపత్రిలో బయటపెట్టిన అంశాలు రాజకీయంగా పెద్ద దుమారాన్నే రేపుతోంది. ఒకవైపు రాజధాని తరలింపు వివాదం ముదురుతున్న సమయంలోనే జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా ఇన్ సైడర్ ట్రేడింగ్ వివాదాన్ని తెరపైకి తెచ్చినట్లు అర్ధమైపోతోంది.

 

ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని వైసిపి, జగన్ ప్రభుత్వం జరగలేదని అంతా ఉత్తిదే అంటూ చంద్రబాబు అండ్ కో ఇంకోవైపు మాటలు యుద్ధాలు చేసుకుంటున్న విషయం అందరికీ తెలిసిందే.  ఇటువంటి నేపధ్యంలో  బయటకు వచ్చిన కథనం సంచలనంగా మారింది. దాని ప్రకారం ఇన్ సైడర్ ట్రేడింగ్ అనే అంశంపైన కన్నా ’ఓత్ ఆఫ్ సీక్రెసి’ కి చంద్రబాబు వెన్నుపోటు పొడిచినట్లు జగన్ మీడియా గట్టిగా హైలైట్ చేస్తోంది.

 

ఓత్ ఆఫ్ సీక్రెసీని ఉల్లంఘిస్తే ఎటువంటి సెక్షన్లను పెడతారు ? ఏ సెక్షన్ క్రింద ఎటువంటి శిక్షలు పడతాయనే విషయాన్ని సదరు మీడియా చెప్పింది. ఓత్ ఆఫ్ సీక్రెసీని ఉల్లఘించినందుకు చంద్రబాబుతో పాటు లబ్దిపొందింనందుకు మాజీ మంత్రులు యనమల రామకృష్ణుడు, దేవినేని ఉమామహేశ్వరరావు, రావెల కిషోర్ బాబు, ప్రత్తిపాటి పుల్లారావు, పరిటాల సునీత, మాజీ ఎంఎల్ఏలు దూళిపాళ్ళ నరేంద్ర, వేంరెడ్డి సురేంద్రరెడ్డి, ఎంఎల్ఏ పయ్యావుల కేశవ్ తదితరులపై సిఐడి  418, 420, 406, 403, 409 సెక్షన్ల అప్లై అవుతాయని చెప్పింది.

 

పై సెక్షన్ల క్రింద కేసులు పెట్టి ఓత్ ఆఫ్ సీక్రెసిని ఉల్లంఘించారని నిరూపణ అయితే  418 సెక్షన్ క్రింద మూడేళ్ళ జైలు శిక్ష, జరిమాన పడుతుందట. సెక్షన్ 420 క్రింద ఏడేళ్ళు జైలుశిక్ష పడుతుందట.  403 క్రింద రెండేళ్ళ జైలు శిక్ష,  జరిమానా పడుతుందట. సెక్షన్ 406 క్రింద మూడేళ్ళ శిక్ష, జరిమానా, సెక్షన్ క్రింద గరిష్టంగా పదేళ్ళ జైలుశిక్షతో పాటు జరిమానా పడుతుందట.  మరి సిఐడి పెట్టే కేసులకు తోడు ఇన్ కమ్ ట్యాక్స్ విభాగం కూడా దర్యాప్తు చేసి కేసులు పెడితే ఆ శిక్షలు వేరే విధంగా ఉంటాయోమో చూడాలి.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: