ఇల్లు కట్టుకోవాలని ఎవరికీ ఉండదు చెప్పండి.. ప్రతి ఒక్కరికి సొంతింటి కల అనేది ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఆ కల చాల తక్కువ మంది తీర్చుకోగలుగుతారు. కారణం ఏదైనా సొంతింటి కల అనేది కలలానే ఉంటుంది. అయితే ఆలా ఉండకుండా సొంత ఇంటి కల నెరవేరేందుకు ఇల్లు కట్టుకునే వారికి తెలంగాణ ప్రభుత్వం పెద్ద శుభవార్త చెప్పింది. 

 

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఇళ్ల నిర్మాణ అనుమతుల్లో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలిగించి కొత్త మునిసిపల్ చట్టాన్ని అమల్లోకి తీసుకువచ్చింది. అయితే ఈ చట్టం ద్వారా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. గతంలో ఇబ్బందులు పడినట్టు ఇప్పుడు పడాల్సిన అవసరం లేదు. ఈ కొత్త చట్టం ద్వారా ఇంటి అనుమతులు సులభంగా మంజూరు అవ్వనున్నాయి. 

 

75 గజాల్లోపు స్థలంలో జీ+1 ఇంటి నిర్మాణానికి అనుమతులు అవసరం లేదు. అంతేకాదు ఇల్లు నిర్మించుకునే వారు ఆన్‌లైన్‌లో కొన్ని వివరాలు సమర్పించి కేవలం ఒక్క రూపాయి చెల్లిస్తే చాలు ఇల్లు నిర్మించుకునే సదుపాయం ఉంటుంది. ఇల్లు నిర్మాణం పూర్తయ్యాక మునిసిపాలిటీ నుండి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. 

 

అంతేకాదు ఇంకా చాల ఉన్నాయి.. 64 చదరపు అడుగులు నుంచి 500 చదరపు అడుగుల లోపు విస్తీర్ణంలో పది మీటర్ల ఎత్తులో ఇల్లు నిర్మించుకోవాలనుకొనేవారు ఆన్‌లైన్‌లో సెల్ఫ్ డిక్లరేషన్ సమర్పిస్తే వెంటనే అనుమతులు వస్తాయి. ఇంకా అంతేకాదు 500 చదరపు అడుగులు, అంతకంటే ఎక్కువ, 10 మీటర్ల లేదా అధిక ఎత్తులో ఇల్లు నిర్మించుకోవాలనుకుంటే ఆన్‌లైన్‌లో 21 రోజుల్లోనే అనుమతి పొందవచ్చు. 

 

ఇలా మంచి మాత్రమే కాదు..ఆ తప్పు చేస్తే మరో కఠినమైన శిక్ష కూడా ఉంటుంది. అది ఏంటంటే.. ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా ఇల్లు నిర్మాణం చేస్తే మూడేళ్ళ జైలు, భారీ జరిమానా తప్పదని చట్టం చెబుతోంది. మరి జాగ్రత్తలు పాటించండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: