దేశంలో తిరుమల తరువాత అంతగా పాపులర్ అయినా దేవాలయం షిరిడి సాయిబాబా ఆలయం.  సాయిబాబా ఎక్కడ పుట్టారు.  ఎప్పుడు పుట్టారు అనే విషయం ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు.  దాని గురించి ఇప్పటికి వివాదాస్పదంగానే ఉన్నది.  సాయిబాబా షిరిడిలో స్థిరపడిన సంగతి తెలిసిందే.  అక్కడే మరణించారు.  షిరిడిలోనే సాయిబాబు మందిరాన్ని నిర్మించి, ఆ మందిరాన్ని అక్కడే అభివృద్ధి చేశారు.  


అయితే, ఇప్పుడు ఈ మందిరంపై వివాదం నడుస్తున్నది.  మహారాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఓ నిర్ణయం తీసుకున్నది.  సాయిబాబా జన్మించిన ప్రాంతం పత్రి అని, పత్రిలో ఆలయాన్ని డెవలప్ చేయాలని చూస్తున్నారు.  దానికోసం రాష్ట్రప్రభుత్వం రూ. 100 కోట్లు మంజూరు చేసింది.  ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు అన్ని రకాల ప్లానులు వేస్తున్నది.  ఇది ఇప్పుడు వివాదాస్పదంగా మారింది.  


పత్రీలో ఆలయాన్ని డెవలప్ చేస్తే షిరిడి అభివృద్ధి ఆగిపోతుందని, షిరిడీలోనే అభివృద్ధి జరగాలని పట్టుబడుతున్నారు.  ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ, షిరిడీ ఆలయాన్ని నిరవధికంగా మూసివేస్తున్నట్టు ఆలయ ట్రస్ట్ ప్రకటించింది.  ఆలయ ట్రస్ట్ తీసుకున్న నిర్ణయంతో ప్రభుత్వం షాక్ అయ్యింది.  అయినా సరే పత్రిని డెవలప్ చేస్తుందా లేదంటే షిర్డీ ట్రస్ట్ బోర్డు కు సహకరిస్తోందా చూడాలి.  


సాయిబాబా నాలుగేళ్ల వయసులో అందరికి పత్రిలో కనిపించారు.  అప్పటి నుంచి ఆక్కడే పుట్టారు అని నమ్ముతూ వస్తున్నారు.  కానీ, అయన నోటివెంట నేను ఫలానా ప్రాంతంలో పుట్టాను అని ఎవరికీ చెప్పలేదు.  ఇప్పటి వరకు వివాదం కానీ ఈ ప్రాంతం ఉద్దవ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో వివాదంగా మారింది.  ఎందుకు ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందో తెలియడం లేదు. షిరిడి ఆలయం  ఆలయానికి ఆదాయం పడిపోయింది. చుట్టుపక్కల ఉన్న షాపులకు గిరాకీ తగ్గిపోతున్నది.  రాజకీయాల్లోకి దేవాలయాలను లాగడం ఏంటి అని కొందరు ప్రశ్నిస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: