ఉస్మానియా అసిస్టెంట్ ప్రొఫెసర్ ఖాసీంను గజ్వేల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విద్యార్థులు ప్రతిఘటించటం వలన ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఖాసీంను పోలీసులు అరెస్ట్ చేశారు. దాదాపు ఐదు సంవత్సరాల క్రితం మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయని ఖాసీంపై కేసు నమోదు అయింది. ఖాసీం భార్య మాత్రం ప్రభుత్వాన్ని ప్రశ్నించడం వలనే తన భర్తపై తప్పుడు కేసులు నమోదు చేశారని ఆరోపణలు చేస్తున్నారు.               
 
పోలీసులు ఖాసీం ఇంట్లో సోదాలు నిర్వహించి కంప్యూటర్ హార్డ్ డిస్క్ లను స్వాధీనం చేస్తుకున్నట్టు తెలుస్తోంది. ఓయూ క్యాంపస్ ఆవరణలోని క్వార్టర్స్ లో ఖాసీం నివాసం ఉంటుండగా ఏసీపీ నారాయణ నేతృత్వంలో సోదాలు కొనసాగాయి. ఈరోజు 4 గంటల నుండి 12 గంటల వరకు సోదాలు జరిగినట్టు సమాచారం. తలుపులు తీయటానికి కుటుంబ సభ్యులు నిరాకరించటంతో పలుగు, పారతో పోలీసులు తలుపు బద్దలుగొట్టి ప్రవేశించినట్టు తెలుస్తోంది. 
 
కంప్యూటర్, ల్యాప్ టాప్ హార్డ్ డిస్క్ లతో పాటు అతని దగ్గర దొరికిన కొన్ని పుస్తకాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఖాసీంను అరెస్ట్ చేసిన పోలీసులు గజ్వేల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. పోలీసుల ప్రయత్నాలను విద్యార్థి సంఘాల నేతలు అడ్డుకోవటానికి ప్రయత్నాలు చేయటంతో కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసుల తీరుపై ఖాసీం భార్య తీవ్రంగా విమర్శలు చేసింది. 
 
పోలీసులు ఖాసీంకు కూడా మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయని చెబుతున్నారు. కొన్నిరోజుల క్రితం విరసం రాష్ట్ర కార్యదర్శిగా ఖాసీం ఎన్నికయ్యారు. పోలీసులు కావాలనే టార్గెట్ చేసి అరెస్ట్ చేశారని కొందరు ఆరోపణలు చేస్తున్నారు. 2016లో నమోదైన కేసు ఆధారంగా పోలీసులు ఖాసీంను అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. సిద్ధిపేట జిల్లా ములుగు పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసులో ఖాసీం ఏ 2 గా ఉన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: