ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మూడు  రాజధానిల  ప్రకటన చేసినప్పటి నుంచీ బిజెపి ఎంపీ సుజనా చౌదరి అధికార వైసీపీ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే.  తాజాగా బిజెపి ఎంపీ సుజనాచౌదరి వైసిపి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి మారినప్పుడల్లా రాజధాని మారుతుందా  అంటూ ప్రశ్నించారు సుజనా  చౌధరి. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తుంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. జగన్మోహన్ రెడ్డి సర్కార్  3 రాజధానిల నిర్ణయంపై ఏకపక్షంగా ముందుకు వెళ్తుంటే .. కేంద్ర ప్రభుత్వం చూస్తూ ఊరుకోరు  అంటూ హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వమే కాదు రాష్ట్ర ప్రజలు కూడా చూస్తూ ఊరుకోరని తెలిపారు సుజనా. ఇప్పటికైనా ఇలాంటి ఆలోచనలు విరమించుకోవాలని హితవు పలికారు.

 


 రాష్ట్రంలోని అన్ని జిల్లాల ను అభివృద్ధి చేయాలని తెలిపిన ఎంపీ సుజనా చౌదరి... ప్రజాభీష్టాన్ని కాదని ఏకపక్ష నిర్ణయం తీసుకోవడం సరికాదని అంటూ విమర్శించారు. హైకోర్టు సచివాలయం రాజ్ భవన్ వంటివి ఒకేచోట ఉండాలని  విభజన చట్టం సెక్షన్ 5 లో ఉంది అంటూ చెప్పుకొచ్చారు. రాజధాని మార్పు పై ప్రజా ఉద్యమం రూపంలోనే కాకుండా న్యాయపరంగా కూడా పోరాడుతామని తెలిపారు. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం తన తీరు మార్చుకోకుండా  ఏకపక్షంగా ముందుకు వెళ్తే ... ఏం చేయాలో అది చేసి చూపిస్తాం అంటూ వ్యాఖ్యానించారు సుజనాచౌదరి. రాజధాని విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ జోక్యం చేసుకోవాలో  అప్పుడు జోక్యం చేసుకుంటుందని తెలిపారు. రాజధాని అమరావతి నిర్మాణం కోసం కేంద్రం నుంచి 25 వేల కోట్లు ఇచ్చామని చెప్పిన సుజనా  చౌదరి... రాజధాని అనేది కేవలం అమరావతికి  మాత్రమె సంబంధించింది  కాదు అని  రాష్ట్రం మొత్తానికి చెందినట్లు తెలిపారు.

 


 రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన 3 రాజధానుల వల్ల భారీగా ప్రజాధనం వృథా అవుతుందని తెలిపారు. ప్రభుత్వం ఇలాగే వ్యవహరిస్తే ఆర్థిక సంక్షోభ పరిస్థితులు ఏర్పడతాయని ఎంపీ సుజనా అన్నారు . ఇది ప్రజాస్వామ్యమని  వైసీపీ ప్రభుత్వం తన మూడు రాజధానిల నిర్ణయం వెనక్కి తీసుకునే పరిస్థితులు తప్పకుండా వస్తాయని వ్యాఖ్యానించారు. రాజధాని విషయంలో అవినీతి జరిగితే వైసీపీ ప్రభుత్వం విచారణ జరపాలి అంతేకానీ ఇష్టానుసారంగా మాట్లాడకూడదు అంటూ సుజనా  చౌదరి విమర్శించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: