ఈమధ్య రోజురోజుకూ పెట్రోల్ బంకుల్లో  ప్రమాదాలు పెరిగిపోతూనే ఉన్నాయి. పెట్రోల్ బంకులో పెట్రోల్ కొట్టించుకునేందుకు  వచ్చిన వాహనదారుల నిర్లక్ష్యంతో కొన్ని ప్రమాదాలు జరుగుతుంటే..  పెట్రోల్ బంక్ సిబ్బంది కారణంగానే కొన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎవరి వల్ల ప్రమాదం జరిగిన ఎంతోమంది ప్రాణాలు మాత్రం గాల్లో కలిసిపోతున్నాయి . కాగా ఈ రోజుల్లో పెట్రోల్ బంకుల్లో ప్రమాదాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. తాజాగా గుంటూరు జిల్లా చిలకలూరిపేట లో విషాద ఘటన చోటుచేసుకుంది. కరెంట్ షాక్ కారణంగా ముగ్గురు సిబ్బంది అక్కడికక్కడే మృతి చెందారు. దీంతో ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. 

 

 వివరాల్లోకి వెళ్తే... గుంటూరు జిల్లా చిలకలూరిపేట లోని భారత్ పెట్రోల్ బంక్ లో పెట్రోల్ బంక్ టాప్ లో ఉండే బల్బ్ కాలిపోయింది. అయితే ఆ బలుపు మరమ్మతులు చేసి కొత్త బట్టలను బిగించాలని పెట్రోల్ బంక్ సిబ్బందిపై అనుకున్నారు. ఈ మేరకు ఒక ఐరన్ స్టాండ్ వేసుకుని పెట్రోల్ బంక్ లో కాలిపోయిన బల్బును తీసి వేరే బల్బును బిగించేందుకు యత్నం చేశారు. ఈ క్రమంలోనే ఓ వ్యక్తి స్టాండ్ పై నిలబడి బల్బు మరమ్మతు చేస్తుండగా ఇద్దరు వ్యక్తులు ఆ స్టాండ్ ఎక్కడ పడిపోకుండా పట్టుకొన్నారు . ఇంతలో కరెంటు వైర్లు స్టాండ్ కి తగలడంతో కరెంట్ స్టాండ్ లోకి ప్రవేశించింది. 

 

 పక్కనే హైటెన్షన్ వైర్లు ఉండడంతో అది గమనించకుండా సిబ్బంది అలాగే అప్రమత్తత లేకుండా పని చేశారు. దీంతో ఇనుప స్టాండ్ హైటెన్షన్ వైర్లకు తగలడంతో ఒక్కసారిగా భారీ మొత్తంలో కరెంటు పాస్ అయింది. దీంతో స్టాండ్ పై ఉన్న వ్యక్తితో పాటు స్టాండ్ పట్టుకుని ఇద్దరు వ్యక్తులు కి ఒక సారి కరెంట్ షాక్ కొట్టింది. దీంతో కరెంటు షాక్ కొట్టిన క్షణాల్లోనే ఆ ముగ్గురు ప్రాణాలు వదిలారు. దీంతో ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ కరెంట్ షాక్ లో చనిపోయిన మృతుల్లో మౌలాలి, శ్రీనివాసరావు,  శేఖర్ ఉన్నట్లు సమాచారం. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: