షిరిడీ సాయినాథుడు... భక్తులకు ఎలాంటి సమస్యలు ఉన్నా తీరుస్తూ ఉంటాడు. ఎలాంటి చిక్కుల్లో పడిన దానికి ఒక మార్గం చూపిస్తూ ఉంటాడు సాయినాథ్. కానీ ఇప్పుడు మాత్రం ఆ సాయినాధునికే  చిక్కులు వచ్చిపడ్డాయి. సాయినాథుడి ప్రతిష్ఠాత్మక క్షేత్రమైన షిరిడి ఆలయానికి సంబంధించి ప్రస్తుతం ఓ వివాదం  తెరమీదకి వచ్చింది. సాయినాథుడు శిరిడీలో జన్మించ లేదని ఆయన జన్మస్థలం పాత్రి లోనని  మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే ప్రకటించడంతో వివాదం మొదలైంది. సాయిబాబా అసలు జన్మస్థలమైన పాత్రిని షిరిడి కి మించి  అభివృద్ధి చేస్తామని ఇందుకోసం వంద కోట్ల రూపాయలు కేటాయిస్తామని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించారు. దీంతో సరికొత్త సాయి వివాదం  తెర మీదికి వచ్చింది.

 


 అయితే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే నిర్ణయంపై షిరిడీలోని సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ మాత్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒకవేళ పాత్రిని  కనుక అభివృద్ధి చేస్తే... ఎంతో ప్రతిష్టాత్మకమైన షిరిడి ఆలయానికి భక్తుల రాక పూర్తిగా తగ్గిపోతుంది అంటూ ఆందోళన వ్యక్తం చేసింది షిరిడి సాయిబాబా సంస్థాన్. ఈ క్రమంలోనే తదుపరి కార్యాచరణపై చర్చించేందుకు నేడు షిరిడి గ్రామస్తులంతా సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. అలాగే రేపటి నుంచి ఆలయాన్ని నిరవధికంగా మూసివేయనున్నారు. ఆలయాన్ని మూసివేయడంతో పాటు ఆలయంలో జరిగే అన్ని పూజా కార్యక్రమాలను కూడా నిలిపివేస్తున్నట్లు సాయి సంస్థాన్ ట్రస్ట్ ప్రకటించింది.

 

 అయితే మహారాష్ట్రలోని పర్భని జిల్లాలో పాత్రి నే సాయిబాబా అసలు సిసలైన జన్మస్థలమని ఎప్పటినుంచో ప్రచారం ఉన్న విషయం తెలిసిందే. పాత్రి షిరిడీకి 275 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. పదహారేళ్ళ వయసులో షిరిడి సాయిబాబా ఇక్కడికి వచ్చి తొలుత ఓ వేప చెట్టు కింద భక్తులకు కనిపించారని చెబుతున్నారు భక్తులు . అయితే సాయి జన్మస్థలం పై ప్రస్తుతం వచ్చిన వివాదం భక్తుల్లో  అయోమయం నెలకొంది. సాయి బాబా ఆలయం ఉండడానికి షిరిడి కరెక్టా లేక పాత్రి కరెక్టా అని భక్తుల్లో ప్రశ్న నెలకొంది. దీనిపై భిన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: