తాడేపల్లి వైసీపీ కార్యాలయం నుండి వైసీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు రైతుల భూములను తన సన్నిహితులకు, స్నేహితులకు, బంధువులకు ధారాదత్తం చేసి రైతుల సొమ్మును నొక్కేశారని అన్నారు. అమాయకమైన ప్రజలను ముందు ఉంచి వీళ్లు నాయకులుగా చలమణీ అవుతూ చేసిన విధానాన్ని ప్రభుత్వ పరంగా ఖండిస్తున్నామని చెప్పారు. ఈ భూ దందా వ్యవహారంలో ఎంతో హుందాగా వ్యవహరించినట్టు బయటకు చెప్పుకుంటున్న టీడీపీ నేతల వివరాలను డాక్యుమెంట్లతో సహా ముందు ఉంచుతామని తెలిపారు. 
 
అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని కరణం ధర్మశ్రీ అన్నారు. రాజ్యాంగాన్ని పూర్తిగా అవమానించే విధంగా చంద్రబాబు వ్యవహార శైలి కనిపించిందని చెప్పారు. రాజ్యాంగం కల్పించిన హక్కులకు కూడా చంద్రబాబు తూట్లు పొడిచారని అన్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఒకలాగా ఇప్పుడు మరోలాగా మాట్లాడుతూ విన్యాసాలు చేస్తున్నారని అన్నారు. చంద్రబాబును యూటర్న్ పితామహుడు అని యూటర్న్ కు బ్రాండ్ అంబాసిడర్ అని అన్నారు. 
 
చంద్రబాబుకు మూడు రాజధానులు ఏర్పాటు చేస్తే మంచిదని తెలుసని కానీ ఏదో రకంగా రాజధానిని అడ్డం పెట్టుకుని రాజకీయంగా పునాది వేసుకోవాలని చేసుతున్నారని అన్నారు. అమరావతి ప్రాంత ప్రజలను అడ్డం పెట్టుకుని చంద్రబాబు రాజకీయ లబ్ధి కోసం కుతంత్రాలు, కుళ్లుతో వ్యవహరిస్తున్నారని అన్నారు. రాజధాని పేరు చెప్పి చంద్రబాబు బినామీలను అడ్డం పెట్టుకొని అమరావతిలో భూములు కొనుగోలు చేశారని బయటికేమో చంద్రబాబు అమరావతి అని అన్నారని లోపలేమో అవినీతికి అడ్రస్ గా మార్చారని అన్నారు. 
 
పాలన వికేంద్రీకరణ అంశాన్ని బాబు రాజకీయం చేస్తున్నారని అన్నారు. కమిటీ నివేదికలను బాబు ఎందుకు తప్పుబడుతున్నారని ప్రశ్నించారు. ఓత్ ఆఫ్ సీక్రసీకి చంద్రబాబు పాతరేశారని అన్నారు. చంద్రబాబులాంటివాళ్లు రాజకీయాల్లో ఉండకూడదని ఈ సందర్భంగా మనవి చేస్తున్నానని కరణం ధర్మశ్రీ అన్నారు. రేపటినుండి చంద్రబాబు అతని బినామీల జాతకం బయటపడుతుందని అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: