సోషల్ మీడియా వాడేవారు సంఖ్య రోజు రోజుకి పెరుగుతుండడంతో ప్రతి అంశం మీద ఇక్కడ పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ప్రధాన మీడియా కంటే ఎక్కువ ఇక్కడ చర్చలు నడుస్తుంటాయి. ఎవరికీ వారు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తం చేసే అవకాశం ఉండడంతో సోషల్ మీడియా కు ఆదరణ పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం జనసేన బీజేపీ పొత్తు పెట్టుకోవడంపై తీవ్ర స్థాయిలో చర్చ నడుస్తోంది. ఎక్కువగా మేధావులు,  రచయితలు, పవన్ తీరును ఎక్కువగా తప్పుపడుతున్నారు. 


పవన్‌ కళ్యాణ్‌ గొప్పనటుడు. ఆయనకు సన్నివేశం, డైలాగ్‌ లు రాసిస్తే అవలీలగా నటించే అలవాటు ఉన్నవాడు.ఇప్పటి వరకూ మంచి స్క్రిప్ట్‌లు అందిస్తూ దర్శకుడిగా, నిర్మాతగా చంద్రబాబు ఉన్నా ఇప్పుడు అంతకు మించి నాగపూర్‌ వాసులైన గొప్ప దర్శకుడు, నిర్మాత దొరికాడు అంటూ ఒకరు ఒకరు పోస్ట్ పెడితే ఇంకొకరు స్పందిస్తూ పవన్ ఎవరి స్క్రిప్ట్ ప్రకారం నడుచుకుంటున్నాడో ప్రజలకు అర్ధం అయ్యిందన్నారు. అందుకే ఆయనను అట్టర్‌ ఫ్లాప్‌ చేసి ప్రజలు రెండు నియోజక వర్గాల్లోనూ ఓడించారు. నీ ప్యాకేజీ డ్రామాలు మాకు తెలుసులే అంటూ మరొకరు పోస్ట్ పెట్టారు. 


మన తెలుగు హీరోలు గొప్ప నటులే కాదు వీళ్లకు బీభచ్ఛమైన అభిమాన గుంపులు ఉన్నాయి. వీళ్ళ అభిమానాన్ని తమ సినిమా వ్యాపారాభివృద్ధికి ముడి సరుకుగా వాడేసుకుంటున్నారని మరొకరు పోస్ట్ పెట్టారు. పవన్ తనకు భగత్ సింగ్ ఆదర్శం అన్నాడు, చేగువేరా అభిమానినని అన్నాడు గుంటూరు సేసేంద్ర వర్మ, శ్రీ శ్రీ కవితలను చెప్పాడు రాజకీయాల్లోకి ప్రశ్నించడానికే వచ్చానని చెప్పాడు ఇప్పుడేంటి ఇలా చేస్తున్నాడని మరొకరు స్పందించారు. పవన్ ఆడుతున్న రాజకీయ క్రీడలను అంతా కేస్ స్టడీగా తీసుకోవాలి. 


మనం అభిమానించే చేగువేరా, శ్రీ శ్రీ పేర్లు చెప్పగానే గుడ్డిగా అతన్ని సమర్ధించినందుకు సిగ్గుతో తలవంచుకోవాలి. ఇంకా బుడ్డి రానివారు వాళ్ళ చెప్పుతో కూడా కొట్టుకోవచ్చు అంటూ మరో మేధావి అయినా ఓ డాక్టర్ పోస్ట్ పెట్టారు.  ఇప్పుడు జనసేనాని మతతత్వాన్ని తన అభిమానుల ద్వారా రాష్ట్రమంతా అంటించడానికి సిద్దమయ్యాడు అంటూ మరికొందరు స్పందించారు. ఇలా సోషల్ మీడియాలో పవన్ పై పెద్ద ఎత్తున ఎదురుదాడి మొదలయ్యింది.

మరింత సమాచారం తెలుసుకోండి: